టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్స్ లో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్ జంట కూడా ఒకటి. 2020 ఆగస్టు 8న ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున విషయం మనకు తెలిసిందే.. సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ టాలీవుడ్ లోనే రొమాంటిక్ కపుల్స్ లాగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. పండగలు- ఫంక్షన్ల సందర్భంలో ఈ జంట కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఆ ఫోటోలకు సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఇక ఈ క్రమంలోనే రానా ఫ్యామిలీకి సంబంధించి గత కొన్ని రోజులగా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రానా భార్య గర్భవతి అనే వార్తలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చెక్కర్లుకొడుతూ ఉన్నాయి. తాజాగా ఈ వార్తలపై రానా భార్య మిహికా స్పందించారు.
రానా భార్య వ్యాపారంతో పాటు సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. అలానే తన భర్త రానాతో దిగిన ఫోటోలను వీడియోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ సందర్భంలోనే తాజాగా మిహికా షేర్ చేసిన ఒకఫోటోలో ఆమె కొంచెం లావుగా కనిపించడంతో ఆమె గర్భవతి అనే రూమర్లు బయటికి వచ్చాయి.
తాజాగా ఇదే విషయంపై మిహికాను ఓ నెటిజన్ మీరు ప్రెగ్నెంటా..? అని అడిగాడు.. అ ప్రశ్నకు మిహికా సమాధానం ఇస్తూ.. ‘నేను నా ఫ్యామిలీ లైఫ్ లో ఎంతో హ్యాపీగా ఉన్నాను.. అందుకే ఈ మధ్యకాలంలో కాస్త లావు పెరిగాను అంటూ మిహికా’ సమాధానం ఇచ్చింది. రానా భార్య గర్భవతి అని వస్తున్న వార్తలకు రూమర్లకు చెక్ పడినట్లయింది. ఏది ఏమైనా సరే ఈ జంట స్పీడు చూస్తుంటే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే విధంగా ఉంది. ప్రస్తుతం రానా భార్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.