కేసిఆర్ ఓ ఆదిపురుష్… రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!

సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడితే అది ఒక సంచలనమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చుతూ బీఆర్ఎస్ అనే పేరు పెట్టారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా ఎవరు ఊహించని విధంగా తనదైన రీతిలో కామెంట్లు పెట్టాడు. ఇప్పుడు ఆ కామెంట్లు వైరల్ గా మారాయి.

KCR renames TRS as BRS, no launch of new party

ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా కేసిఆర్ ని ఆదిపురుష్ అంటూ సంచలన ట్వీట్ చేశాడు. జాతీయ రాజకీయాల్లో వస్తున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక ప్రాంతీయ పార్టీ అయినా టిఆర్ఎస్ ని జాతీయ పార్టీగా మార్చినందుకు ఆయనను ఆది పురుష్‌ అంటూ సోష‌ల్ మీడియా వేదికగా అర్జీవి స్పందించాడు.

TRS gets into agitation mode over paddy issue

తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) ను జాతీయ పార్టీగా భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)గా మారుస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఇక దీంతో టిఆర్ఎస్ అనే పేరు మర్చిపోవాల్సిందే.. 2001లో కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీ పేరు ప్రకటించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ పార్టీ పెట్టి 21 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చుతు జాతీయ రాజకీయాల్లోకి ఆయన అడుగు పెట్టాడు.

Share post:

Latest