రామ్ చరణ్ కోసం.. ఆ సీనియర్ నటి రాబోతుందా..!

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమాలో.. సీనియర్ హీరోయిన్ కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఓ రోల్ లో ఆ సీనియర్ హీరోయిన్ నటించబోతుందని తెలుస్తుంది. ఆ సీనియర్ హీరోయిన్ మరి ఎవరో కాదు కుష్బూ.

ఈ సినిమాలో కుష్బూ పాత్ర సినిమాకే చాలా కీలకంగా ఉంటుందని.. శంకర్ ఆ క్యారెక్టర్ కి కుష్బూను తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో నటనకు గాను బాలీవుడ్ మీడియా నుంచి హాలీవుడ్ మీడియా వరకు రామ్ చరణ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఇప్పుడు శంకర్ మూవీలో రామ్ చరణ్ తన కెరీయర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.

తన లుక్‌ కూడా చాలా కొత్తగా కనిపించనుందట. రామ్ చరణ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఆయన క్యారెక్టర్ ఈ సినిమాకే హైలైట్ గా ఉంటుందట. రామ్ చరణ్ ఇందులో ద్విపాత్ర అభినయం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా మరో పాత్రలో స్టైలిష్ గా కనిపిస్తాడట. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మరి చూడాలి సినిమా విడుదలైన తరువాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో..ఈ మూవీ..!!

Share post:

Latest