వరసగా ఫ్లాపులు పడుతున్న ప్రభాస్ మళ్లీ మళ్లీ అదే తప్పు ఎందుకు చేస్తున్నాడు?

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `బాహుబలి` సినిమాతో కేవలం భారతదేశం లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా పరిచయమై పాన్ ఇండియా స్టార్ హీరోగా నిలిచాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు `సాహో`, `రాధే శ్యాం` కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టు కోవడంతో ప్రభాస్ అభిమానులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ త్వరలో రిలీజ్ కాబోతున్న `ఆదిపురుష్` సినిమా మీద పెట్టుకున్నారు.

 

అయితే ప్రభాస్ సంక్రాంతి కానుకగా `ఆదిపురుష్` సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే `ఆదిపురుష్` మేకర్స్ ప్రభాస్ అభిమానులకు `ఆదిపురుష్` ట్రీజర్ ను రిలీజ్ చేసి ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఈ టీజర్ కి మిశ్రమ స్పందన లభించిన తాజాగా చాలామంది సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ గురించి సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్ లో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అదేమిటంటే ప్రభాస్ `బాహుబలి` సినిమా తర్వాత చేసిన సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటంటే టి సిరీస్ సంస్థ -యు.వి.క్రియేషన్స్ అసోసియేషన్ అవడమే అని సమాచారం. అయితే బాహుబలి తర్వాత రిలీజ్ అయిన రెండు సినిమాలు ఈ బ్యానర్ల పైనే నిర్మించారు. పైగా ఇప్పుడు `ఆది పురుష్` కూడా అదే బ్యానర్ పైన నిర్మించడంతో ప్రభాస్ అభిమానులు ఈ విషయంలో భయపడుతున్నారు.

అయితే ప్రభాస్ తన సినిమాలను సరిగా ప్రమోట్ చేయకపోవడం వల్లే.. తాజాగా రిలీజ్ అయిన ఆది పురుష్ ట్రీజర్ పై ఇలాంటి ట్రోలింగ్ వస్తుందని వారి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో వచ్చిన సాహో, రాధేశ్యాం మూవీలను కూడా సరిగా ప్రమోషన్స్ చేయలేదన్న టాక్ వైరల్ అవుతుంది. అయితే వరల్డ్ క్లాస్ మైథాలజికల్ విజువల్ వండర్ ని అందిస్తారని ఆశపడిన అభిమానులకు ఒక యానిమేటెడ్ కార్టూన్ ఫిలిం అందిస్తున్నారా..? అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే ముందుగానే ఒక పోస్టర్ని విడుదల చేసి ఉంటే ఈ సినిమాపై ఇలాంటి ట్రోల్స్ వచ్చేవి కావు.. వరస ఫ్లాపులు పడుతున్న ప్రభాస్ మళ్లీమళ్లీ అదే తప్పు ఎందుకు చేస్తున్నాడు? అంటూ నేటిజెన్లు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంతటి గందరగోళంలో రాబోతున్న `ఆదిపురుష్` సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో ఎదురు చూడక తప్పదు.

Share post:

Latest