పవన్ పెట్టుకున్న ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా..రేటు తెలిస్తే నోరెళ్లబెడతారు..!!

జనాల్లో చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. మనకి ఇష్టమైన హీరో గాని హీరోయిన్ గాని మంచి బట్టలు వేసుకున్నా.. భలే ఉందే.. ఎక్కడ కొన్నారు.. ఎంతకి కొన్నారు.. లేదా ఏదైనా నగలు పెట్టుకున్నా భళే ఉందే ఎన్ని సవర్లకి చేయించుకున్నారు. ఇలాంటివి మాట్లాడుకోవడం సర్వసాధారణం . అమ్మాయిలే కాదు అబ్బాయిలకు ఈ పిచ్చి ఉంటుంది. ఎవరైనా హీరో షూస్ వేసుకున్న ఓ వాచ్ పెట్టుకున్న భలే ఉందే ఏ బ్రాండ్ కి సంబంధించింది ఇది. దీనిలోని స్పెషాలిటీస్ ఏంటి అని గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా, గూగుల్ ఇలాంటివన్నీ అందుబాటులో లేవు కదా.. అందుకే అలా చూసి అలా కళ్ళతోనే ఎంజాయ్ చేసేవాళ్లు.

 

కానీ ఇప్పుడు అలా కాదు అంత సోషల్ మీడియా యుగం. ఏదైనా వస్తువు నచ్చిందా దాన్ని ఇలా చూసామా.. అలా స్కాన్ తీసామా.. ప్రోడక్ట్స్ డీటైల్స్ కనుక్కునేసామా.. ప్రజెంట్ జనరేషన్ ఇలానే ఉంది. ఈ క్రమంలోనే స్టార్ హీరో హీరోయిన్స్ వేసుకునే బ్రాండెడ్ ఐటమ్స్ గురించి ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తాలూకా పిక్స్ సోషల్ మీడియాలో రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి బయట ఏ ఫంక్షన్లో కనపడిన ఆ తెల్ల బట్టల్లోనే కనిపించే వాళ్ళు. మోడ్రన్ దుస్తుల్లో కనిపించడం చాలా రేర్.

ఇలా పవన్ ఫ్యాన్స్ బాగా డీలా పడిపోతున్న సమయంలో మంచి బూస్టప్ ఇస్తూ స్టైలిష్ లుక్ లో హాట్ గా కనిపించాడు పవన్ కళ్యాణ్ . దీంతో ఒక్కసారిగా ఈ ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. జీన్స్ లో రెడ్ టీ షర్ట్ బ్రాండెడ్ షూస్ ..బ్రాండెడ్ వాచ్.. పర్ఫెక్ట్ బాడీ ఫిట్నెస్ తో పవన్ కళ్యాణ్ అల్లాడిస్తున్నాడు . ఈ క్రమంలోనే ఆయన ధరించిన షూస్, బ్రాండెడ్ వాచ్ గురించి సోషల్ మీడియాలో గూగుల్లో తెగ సర్చ్ చేస్తున్నారు కుర్రాళ్ళు.మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ అందరికీ తెగ నచ్చేసింది . సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

 

దీంతో ఈ వాచ్ కు సంబంధించిన డీటెయిల్స్ ని గూగుల్ లో వెతికే పనిలో పడిపోయారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తన చేతికి కట్టుకున్నటువంటి పనరెయ్ సబ్ మర్సిబుల్ కార్బెన్ టెక్ 47మ్మ్. ఈ వాచ్ ధర అక్షరాల… రూ. 14.7 లక్షల రూపాయలని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అంతేకాదు ఓ సామాన్యుడు ఇల్లు కట్టుకొని లగ్జరీగా బతికేయొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత కాస్ట్లీ వాచ్ మనం కొనలేము రా బాబు ఇది సెలబ్రెటీల చేతికే బాగుంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు , మొత్తానికి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన హరిహర వీరమల్లు పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో యమ ట్రెండిగా మారాయి.

Share post:

Latest