రెండు తెలుగు రాష్ట్రాలలో దివంగత రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమా విడుదలై ప్రేక్షకులను ఇప్పటికి కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. దర్శకుడు మహి వీ రాఘవ ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు . ఈ సినిమా విదంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆ సినిమా అప్పట్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కరెక్ట్ గా ఎన్నికల సమయం ముందు ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయడంతో వైయస్సార్ పార్టీకి ఈ సినిమా ద్వారా కాస్త లాభం చేకూరిందని చెప్పవచ్చు.
మళ్లీ కూడా ఇప్పుడు అలాంటి ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం ఈ సినిమా సీక్వెల్ రాబోతున్నట్లు టాక్ బాగా వినిపిస్తోంది. గతంలో యాత్ర సినిమాకు కొనసాగింపు ఈ యాత్ర -2 సినిమాలో జగన్మోహన్ రెడ్డి బయోపిక్ ను చూపించబోతున్నట్లు కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో దుల్కర్ సల్మాన్ ను వైయస్ జగన్ పాత్రలో కనిపించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు దుల్కర్ సల్మాన్ని అడగగా తను మాత్రం ఆ విధంగా అయితే తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని విషయాన్ని తెలియజేశారు.
ఒకవేళ నిజంగానే అలాంటి పాత్ర వస్తే ఆ పాత్ర గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తెలియజేశారు. ఇక ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మహి రాఘవ మల్లి యాత్ర-2 సినిమా సీక్వెల్ ను వచ్చే ఎన్నికలలోపు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇందులో వైయస్ జగన్ కు సంబంధించి పలు అంశాలను కూడా హైలెట్ చేసే విధంగా చేయబోతున్నట్లు సమాచారం . రాజశేఖర్ రెడ్డి గా మలయాళం నటుడు మమ్ముట్టి చాలా అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. మరి యాత్ర -2 సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి ఈ సినిమా 2024 ఎన్నికల ముందు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ప్లాన్ వెనక జగన్ నిర్ణయమే ఉన్నట్లు సమాచారం.