తమిళంలో స్టార్ హీరోగా సూర్య అసాధారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారని చెప్పవచ్చు. ఇక టాలీవుడ్ లో కూడా అంతే క్రేజ్ ను సంపాదించుకున్నారు ఈ హీరో. నటుడు శివకుమార్ వారసుడుగా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కానీ సూర్య ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. హీరో సూర్య ఎదుర్కొన్న కష్టాలు అవమానాలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
వాస్తవానికి సూర్య అసలు పేరు శరవరన్. హీరో అవ్వాలని మొదట అనుకోలేదట కేవలం రూ.720 రూపాయల జీవితానికి ఒక కంపెనీలో పని చేస్తూ ఉండేవారట. అలా ఒక నటుడు కొడుకు కథ అంటూ సినిమాలు చేసుకోపో అంటూ అక్కడ నుంచి తరిమేశారట. ఆ తర్వాత అతడు ఎదుర్కొన్న అవమానాలు ఏ ఇతర నటులు కూడా అనుభవించరట. పొట్టిగా ఉన్న వాడు హీరో ఎలా అవుతారు అంటూ చాలా హేళన చేశారట. కెరియర్ ప్రారంభంలో అందరిలాగే కొన్నేళ్లపాటు డిజాస్టర్ సినిమాలు వెంటాడాయి సూర్య అని.
ఇక తర్వాత ఎత్తు కవర్ చేయడానికి నాలుగు ఇంచుల షూ ని కూడా ధరించేవాడట సూర్య. అంతేకాకుండా ఇద్దరు హీరోల సినిమాలో వేరొక హీరో సెట్ అవ్వకపోతే ఆ ప్లేస్ లో రీప్లేస్ గా నటించారు సూర్య. కానీ ఆ సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో అసలు సూర్య ఉంటే ఈ సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఐరన్ లెగ్ గా ఇండస్ట్రీ ముద్ర వేసిందట. అసలు సూర్య ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేవు అసలు హీరోనే కాదు ఎందుకు ఇలా హింసిస్తున్నారు అంటూ ఆయన తండ్రి ముందే తనని ఎంతోమంది అవమానించారట. ఇక తన తండ్రికి కూడా అవకాశాలు లేక పలు సీరియల్స్ లో నటించారు.అలా ఎన్నో అవమానాలను ఎదుర్కొని సూర్య ఇప్పుడు స్టార్ హీరోగా ఉన్నారు.