ఎన్టీఆర్ 30.. నవంబర్‌లో లాంఛింగ్, డిసెంబర్‌లో షూటింగ్.. ఇది ఫైన‌ల్‌!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన “త్రిబుల్ ఆర్” సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇప్పటివరకు కూడా మరో సినిమాను మొదలుపెట్టలేదు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.

NTR 30 To Get More Delay

అయితే ముందుగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ తన లుక్ ను సైతం మార్చుకోవడానికి ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ కుమార్ గైడెన్స్ లో ట్రైనింగ్ తీసుకుని ఫిట్గా తయారయ్యి కొరటాల శివ కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ప్ర‌స్తుతం నెట్టింట‌ వైరల్ గా మారింది. అదేమిటంటే నవంబర్ రెండో వారంలో ఎన్టీఆర్ 30 సినిమాను ఫార్మల్ గా లాంచ్ చేసి.. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ను నిర్వహించడానికి సినిమా టీం ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ 30.. నవంబర్లో లాంచింగ్.. డిసెంబర్లో షూటింగ్ ఇది ఫైనల్.. అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అతి త్వరలోనే అధికార ప్రకటన రానుంది. డైరెక్టర్ కొరటాల శివ `ఆచార్య` సినిమాతో డిజాస్టర్ అందుకున్న కారణంగా ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఈ విషయంపై ఎప్పుడెప్పుడు అధికారికంగా క్లారిటీ ఇస్తారా అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.