అలా చేయడానికి రెడీ..ఫ్యాన్స్ కోసం కృతి సంచలన నిర్ణయం..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి శెట్టి ..ఆ తర్వాత రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి ..తన ఖాతాలో హ్యాట్రిక్ హిట్స్ వేసుకుంది . ఈ క్రమంలోనే కృతిశెట్టి పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది . దీంతో అమ్మడు అదృష్ట దేవత.. ఇండస్ట్రీకి వచ్చిన లక్ష్మీదేవి అంటూ పొగిడేశారు .

అయితే, కృతి నుండి వచ్చిన మిగతా మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది . ఈ క్రమంలోనే కృతి కెరియర్ గ్రాఫ్ డౌన్ అయింది . ఇలా కొనసాగితే వచ్చిన అవకాశాలు చేయి జారిపోతాయి అనుకున్నిందో ఏమో..తన తదుపరి సినిమా హిట్ అయితే..అభిమానులను డైరెక్ట్ గా మీట్ అవ్వడానికి ప్లాన్ చేసుకుందట.

నాగచైతన్య నటిస్తున్న సినిమా హిట్ అయితే మాత్రం డైరెక్ట్ గా అభిమానులను కలవడానికి రెడీ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇదే న్యూస్ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎలా అయినా సరే కృతి నెక్స్ట్ సినిమా హిట్ అయ్యేలా చేసి ఆమెను డైరెక్ట్ గా మీట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు . మరి చూడాలి ఇంత చిన్న వయసులోనే టూ మచ్ తెలివితేటలు ఉన్న కృతి శెట్టి ఇండస్ట్రీలో ఎలాంటి స్దానం సంపాదించుకుంటుందో..?

Share post:

Latest