ఫైనల్లీ..ఆస్కార్ బరిలో RRR..ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ఇవే..!!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించిందని మనందరికీ తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై రూ.1200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా ఎవరు ఊహించని రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలను తెచ్చుకుంది. ఈ సినిమాని చూసిన హాలీవుడ్ దర్శకులు సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ల కి.. క్రియేట్ చేసిన రికార్డులకి.. ఈ సినిమా ఇండియా నుండి ఆస్కార్‌కిి పంపిస్తారని అందరూ భావించారు. కానీ ఇండియా నుంచి ఈ సినిమాకి బదులు గుజరాతి సినిమా అయినా ‘ది చెల్లో షో’ని వారు ఆస్కార్‌కిి ఎంపిక చేశారు. దీంతో త్రిబుల్ ఆర్ అభిమానులు అసహనానికి గురయ్యారు.

అయితే ఇప్పుడు ఈ విషయంలో బాధపడిన వారందరికీ ఒక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వార్త ఏమిటంటే.. ఆస్కార్FYC (for your consideration) పేరుతో ఆస్కార్‌కి ఎంపికయ్యే విధంగా 15 క్యాటగిరిలో త్రిబుల్ ఆర్ టీం అవార్డుల కోసం క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది.

ఆస్కార్ అవార్డ్స్ కోసం RRR టీమ్ క్యాంపెయిన్ చేస్తోన్న కేటగిరీలు ఇవే..

1. బెస్ట్ మోషన్ పిక్చర్ (డి.వి.వి. దానయ్య),

2. బెస్ట్ డైరెక్టర్ (ఎస్.ఎస్. రాజమౌళి),

3. బెస్ట్ యాక్టర్ (NT రామారావు(jr), రామ్ చరణ్),

4. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (అజయ్ దేవగన్),

5. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు),

6. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ (ఎమ్.ఎమ్. కీరవాణి),

7. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ (శ్రీకర్ ప్రసాద్),

8. బెస్ట్ సౌండ్ (రఘునాధ్ కేమిశెట్టి, బోలోయ్ కుమార్ బోలోయ్, రాహుల్ కర్పే),

9. బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్‌ప్లే (వి. విజయేంద్రప్రసాద్ (కథ), స్ర్కీన్‌ప్లే (ఎస్.ఎస్. రాజమౌళి), అడిషనల్ డైలాగ్ (సాయిమాధవ్ బుర్రా) ),

10. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రిసెస్ (ఆలియా భట్),

11. బెస్ట్ సినిమాటోగ్రఫీ (కె.కె. సెంథిల్ కుమార్ ఐఎస్‌సి),

12. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (సాబు సిరిల్),

13. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ (రమా రాజమౌళి),

14. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ (నల్ల శ్రీను, సేనాపతి నాయుడు),

15. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ (వి. శ్రీనివాస్ మోహన్-విఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్)

Oscars: How Much Will It Cost For RRR?

ఈ క్యాంపైన్లో భాగంగా త్రిబుల్ ఆర్ఆర్ సినిమాకి లాస్‌ ఏంజెల్స్‌లో జరుగుతున్న బీయాండ్‌ ఫెస్ట్‌లో భారీ స్థాయిలో త్రిబుల్ ఆర్ సినిమాను అక్కడ ప్రదర్శించిన విషయం మనకు తెలిసిందే. అక్కడ థియేటర్లో సినిమాను చూస్తున్న ఫారెన్ ప్రేక్షకులు ఈ సినిమాలోని నాటు నాటు పాటకు డాన్సులతో రచ్చ రచ్చ చేశారు. ఈ వీడియోను అక్కడ లాస్ ఏంజెల్స్ మీడియా వారు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఎంతటి ప్రేక్షకుల అభిమానం అందుకున్న‌ త్రిబుల్ ఆర్ సినిమాను ఆస్కార్ టీం FYC కింద ఏ విభాగాల్లో ఎంపిక చేస్తారా అనేది చూడాలి.