సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరు.. ఎవరితో ప్రేమలో పడతారో ? చెప్పడం కష్టం. కొంతమంది హీరో హీరోయిన్లు వివాహాం చేసుకుంటే.. మరికొంతమంది హీరోయిన్లు డైరెక్టర్లను వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి . అలా సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లను ప్రేమించి మరి వివాహం చేసుకున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
రమ్యకృష్ణ – కృష్ణవంశీ:
మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ .. దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుంది. అయితే వీరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం.
నయనతార – విఘ్నేష్ శివన్:
లేడీ సూపర్ స్టార్ నయనతార కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఇక దాదాపు ఏడు సంవత్సరాల పాటు వీరిద్దరూ రిలేషన్ లో ఉండి పెళ్లి ద్వారా ఒకటయ్యారు. అంతేకాదు ఇటీవలే ఇద్దరు కవలలకు సరోగసి ద్వారా జన్మనిచ్చారు.
రేవతి – సురేష్ మీనన్ :
ప్రముఖ హీరోయిన్ రేవతి కూడా మలయాళం డైరెక్టర్ అయిన సురేష్ మీనన్ ను 1986లో ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ 2014లో విడాకులు తీసుకున్నారు.
శరణ్య – పోవన్నం:
శరణ్య మొదట నటుడు సంపత్ దాస్ ను పెళ్లి చేసుకుంది. మనస్పర్ధలు కారణంగా అతనితో విడిపోయి తమిళ్ డైరెక్టర్ పోవన్నం ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది.
రోజా – సెల్వమణి:
2002లో రోజా తమిళ్ డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగు , తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే వీరి పెళ్లి జరిగిపోయింది.
సుహాసిని – మణిరత్నం:
స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో సుహాసిని డైరెక్టర్ మణిరత్నం ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది.
కుష్బూ – సుందర్:
నటి కుష్బూ కూడా డైరెక్టర్ సుందర్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.
దేవయాని – రాజకుమార్:
నటి దేవయాని డైరెక్టర్ రాజకుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . దేవయాని తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో 2001లో రహస్యంగా వీరు వివాహం చేసుకున్నారు.