గంగవ్వ నెల సంపాదన తెలిస్తే కళ్ళు తేలేస్తారు… మామ్మ మామూల్దీ కాదుగా…!

గంగవ్వ అనే పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. గంగవ్వ యూట్యూబ్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే “మై విలేజ్ షో“ ద్వారా శ్రీకాంత్ ఆమెను యూట్యూబ్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అయితే నిజానికి గంగవ్వ తన నిజ జీవితంలో ఎలా ఉంటుందో అలాగే వీడియోలో కూడా సహజంగా కనిపించడం ద్వారా గంగవ్వకి ప్రజల నుండి మంచి ఆదరణ లభించింది.

ఆ ఆదరణ కారణంగానే బిగ్ బాస్ లో కంటెస్టెంట్గా ఆమెకు మంచి ఆఫర్ దక్కింది. అయినా గంగవ్వ కాస్త వయసు ఎక్కువగా ఉన్న కారణంగా బిగ్ బాస్ హౌస్లో ఎక్కువకాలం కొనసాగలేకపోయింది. ఆ షోతో వచ్చిన తన రెమ్యునేషన్ ని ఉపయోగించుకుని ఒక ఇల్లు నిర్మించుకుని గంగవ్వ ఇప్పుడు యూట్యూబ్ వీడియోలతో ప్రేక్షకులను అలరించుతుంది.

అయితే గంగవ్వ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ తో పాటు తనకు కూడా ఒక సొంత యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని నెలకు బాగానే సంపాదిస్తుందని సమాచారం. అయితే ఆమె ఒకప్పుడు వ్యవసాయ కార్మికురాలిగా పనిచేసుకొని బతికినా.. ఇప్పుడు మాత్రం నెలకు అటు ఇటుగా లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదిస్తుందన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే కేవలం యూట్యూబ్ వీడియోలే కాకుండా గంగవ్వ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది.

అయితే ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో పెద్ద సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇకపోతే గంగవ్వ ఒక్క రోజు సినిమాల్లో నటిస్తే పదివేల రూపాయలు రెమ్యూనేషన్ తీసుకుంటుందట. ఏదేమైనాప్పటికీ గంగవ్వ ఈ వయసులో సెలబ్రిటీ అయి బాగా కష్టపడి మంచి సంపాదన సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.