అలా పిలవొద్దు.. వేలు చూపిస్తూ ప్రగతి `అంటీ` వార్నింగ్‌!

ప్రగతి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తూ.. నటిగా తన నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ప్రగతి చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లకు అమ్మ, అత్త, వదిన వంటి పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.

ప్రస్తుతం ఆమె పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా ప్రగతి ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మిమ్మల్ని `ఆంటీ` అంటే ఎలా స్పందిస్తారు? అని అడగగా.. వెంటనే ప్రగతి అలా పిలవద్దు అన్నట్లు.. వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్నట్టు.. నాన్ను ఆంటీ అని పిలిస్తే అస్సలు ఇష్టపడను, వెంటనే కోపం వచ్చేస్తుంది అని.. ఆంటీ అంటేనే మంట అని ఆమె పేర్కొన్నారు. ఓహో `ఆంటీ` గా కనిపించకూడదనేనా వర్కౌట్స్ చేస్తున్నారు మీరు అని యాంకర్ ప్రశ్నించగా.. ప్రగతి స్పందిస్తూ జిమ్ లో వర్కౌట్స్ చేయడం వల్ల అందం పెరుగుతుందని కాదు బలం, కాన్ఫిడెన్స్ పెరుగుతాయని తెలిపింది.

ఇక అంతే కాకుండా ఆమె ప్రస్తుతం అమ్మ, అత్త పాత్రలో నటిస్తున్నప్పటికీ ఒకప్పుడు హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేశారని కూడా ఆమె తెలిపింది. ప్రగతి అటు సినిమాలు చేస్తూ అలాగే ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా స్పందిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన తాజా ఫొటోస్ పోస్ట్ చేసి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటుంది.

Share post:

Latest