దీపావళి డబుల్ ధమాకా..దగ్గుబాటి ఇంట రెండు గుడ్ న్యూస్ లు..!?

దేశవ్యాప్తంగా నిన్న దివాలి సంబరాలు అంబరాని అంటాయి. చిన్న-పెద్ద , కులం-మతం . పేదరికం-డబ్బు ఇలా ఏ తేడా లేకుండా అందరూ కలిసి దివాలి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే అందరిలో కల్లా దగ్గుబాటి ఫ్యామిలీ ఎప్పుడు లేనివిధంగా ఈ దివాళిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది . దానికి మెయిన్ రీజన్ ..దగ్గుబాటి ఇంటికి ఇద్దరు చిన్నపిల్లలు రాబోతుండడమే.

ఎస్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ దగ్గుబాటి అభిమానులకు ఫుల్ జోష్ ని ఇస్తుంది. అంతేకాదు దగ్గుబాటి హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత కూడా ప్రెగ్నెంట్ అంటూ ఓ న్యుస్ మీడియాకు లీక్ అయింది . దీంతో ఒక్కసారి దగ్గుబాటి ఇంట రెండు గుడ్ న్యూస్ లు వినడం తో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అంతేకాదు అందరూ కలిసి దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర దివాళి సెలబ్రేట్ చేసుకున్నారట. ఇద్దరు అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవ్వడంతో దగ్గుబాటి ఇంట రెండు సంబరాలు షురూ అయ్యాయి . మనకు తెలిసిందే వెంకటేష్ కూతురు అశ్రిత హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారి మనవడితో గ్రాండ్గా వివాహం జరిపించారు వెంకటేష్ . అలాగే రానా దగ్గుబాటి తను ప్రేమించిన అమ్మాయి మిహికా ను గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు . ఈ క్రమంలోనే ఈ జంట ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన అభిమానులకు ఎట్టకేలకు దివాళి సందర్భంగా తీపి కబుర్లు అందించినట్లు తెలుస్తుంది.