ఒక్క ఫోటోతో ఐశ్వర్య-ధనుష్ కలయికపై క్లారిటీ ఇచ్చేసిందా..?

తమిళ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించిన హీరో ధనుష్ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లిన ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తు చాలా బిజీగా ఉన్నారు. ఇక ఏడాది తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో సార్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక తమిళంలో వాతి అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో బీమ్లా నాయక్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తున్నది. ఈ చిత్రం డిసెంబర్ కు విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

Dailyhunt
అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి అది సాధ్యం కాదనిపిస్తోంది. ఎందుచేత అంటే ధనుష్-ఐశ్వర్య గడిచిన కొన్ని నెలల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించడంతో ప్రతి ఒక్కరు షాపుకు గురయ్యారు. అంతేకాకుండా అయితే ఈ ప్రకటన రవిజనీకాంత్ ను చాలా ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. అందుచేతనే ధనుష్,ఐశ్వర్య ను కలిపే ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ వీరిద్దరూ కలవబోతున్నారని తమిళ మీడియాలో పలు ప్రచారాలు కూడా వినిపించాయి.అందుకు తగ్గట్టుగానే ఐశ్వర్య ధనుష్ కలిసి ఒక ప్రైవేటు పార్టీకి హాజరు కావడంతో విడాకుల విషయం నుంచి విరమించుకున్నారని అందరూ భావించారు.

Rajinikanth Celebrates Diwali : ஃபேமிலி டைம்..பேரக்குழந்தைகளுடன் தீபாவளி கொண்டாடிய ரஜினிகாந்த்

ఇక ఎప్పటి లాగానే కలిసి ఇద్దరూ తమ వైవాహిక జీవితాన్ని గడుపుతారని అందరూ అనుకున్నారు. ఇక ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా వీరిద్దరూ విడిపోయి ఉండలేరని స్టేట్మెంట్ ఇవ్వడంతో అందరూ కూడా కలిసిపోతారని అనుకున్నారు. అయితే తాజాగా రజనీకాంత్ ఇంట దీపావళి పండుగ చేసుకున్నటువంటి ఫొటో వైరల్ గా మారుతోంది. ఇందులో రజనీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. అయితే సెలబ్రేషన్స్ లో ఐశ్వర్య పిల్లలు కనిపించిన ధనుష్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో వీరిద్దరూ కలవడంపై వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ వచ్చేసిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కలిసి ఉంటే ధనుష్ కూడా ఈ వేడుకలలో పాల్గొనేవారు కదా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్స్.