ఓరి దేవుడో..ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హీరోనా..ఇదేం ట్వీస్ట్..!!

ఆస్ట్రేలియా స్టార్ట్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి పరిచయం చేయనక్కర్లేదు. డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఏ తెలుగు సినిమా విడుదలైన ఆ సినిమాకు సంబంధించిన పాటలతో స్టెప్పులతో అభిమానులను అలరిస్తుంటాడు. వార్నర్ ఐపిఎల్ టీమ్ లో సన్రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన తెలుగు సినిమాలు చూడడం మొదలు పెట్టాడు.. అప్పటి నుంచి ఏ స్టార్ హీరో సినిమా విడుదలైన డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా ద్వారా సినిమాకు సంబంధించిన గెటప్ లో హల్చల్ చేసేవాడు.

తాజాగా డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు అది ఇప్పుడు వైరల్ గా మారింది. అంతలా వైరల్ అవ్వడానికి ఆ పోస్ట్ ఏమిటో చూద్దాం.. తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డుల్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాకు భారీ స్థాయిలో అవార్డులు వచ్చాయి. ఈ వార్త తెలిసిన డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా పుష్ప టీంకు అభినందనలు తెలిపాడు. సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టి మరి..” ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న పుష్ప టీం ముఖ్యంగా అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం.. ఈ సినిమాలో నటించిన వారందరికీ అభినందనలు తెలిపాడు”. వార్నర్ ఆ పోస్టులో పుష్ప గెటప్ లో ఉన్న తన ఫోటోలను షేర్ చేశాడు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ మారింది.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)