నా భార్య ఎదుటే ఆమెతో ఫ‌స్ట్ నైట్‌.. టాప్ సీక్రెట్ లీక్ చేసిన అలీ!

కమెడియన్ ఆలీ.. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. `ప్రెసిడెంట్ పేరమ్మ` అనే సినిమాతో బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆలీ.. ఆ తరువాత వరుసుగా ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పటివరకు దాదాపు 1000కి పైగా సినిమాలు చేశారు. ఇక అంతే కాకుండా `యమలీల` సినిమాలో హీరోగా నటించిన ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. ఆ తరువాత స్టార్ హీరోల సినిమాల్లో కామెడీ క్యారెక్టర్ లు పోషిస్తూ ఎంతో గుర్తింపు పొందారు. కేవలం సినిమాలలోనే కాకుండా ఇటు బుల్లితెర మీద `ఆలీతో సరదాగా` అనే టాక్ షోలో ప్రస్తుతం హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.

తాజాగా “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి“ అనే సినిమాతో ఆలీ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇటీవల నరేష్, పవిత్ర లోకేష్, ఆలీ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆలీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో ఆలీ మాట్లాడుతూ.. తాను ఓ సినిమా షూటింగ్లో భాగంగా మౌర్యా తో జంటగా ఫస్ట్ నైట్ సీన్ లో నటించాడట.

అయితే అదే రోజు తన మ్యారేజ్ డే కాగా దర్శక నిర్మాతలు తన పెళ్లిరోజు సందర్భంగా షూటింగ్లోనే కేక్ కట్ చేయిస్తామని భార్యా, పిల్లల్ని అక్కడికి తీసుకు వచ్చారట. అలా ఓ వైపు తను ఆ సీన్ లో నటించేటప్పుడు తన భార్య పిల్లలు అందరూ చూస్తున్నారట. ఇక అలాంటి సమయంలో ఫస్ట్ నైట్ సీన్లో నటించడం తనకు నచ్చలేదని అంతేకాకుండా ఆ సీన్ కి వాడింది కూడా అతని మంచ‌మే అని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. అయితే ఆరోజు జరిగిందంతా డైరెక్టర్ కావాలని తన మీద కోపంతో ప్లాన్ చేసినట్టు ఆలీ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

మధ్యలో నరేష్ కలగజేసుకుని ఆలీ నీ ఒరిజినల్ ఫస్ట్ నైట్ షూటింగ్ గ్యాప్ లోనే ముగించేసావట అది నిజమేనా అని అడగగా.. ఆ ప్రశ్నకు ఆలీ ఓపెన్ గా సమాధానం చెప్పాడు. అవును.. నా వివాహం 1994 జనవరి 22న జరగగా.. 23 రిసెప్షన్ పెట్టుకుని 24 అమ్మను,నా భార్యను తీసుకుని హైదరాబాద్ కి వచ్చేసాను. అయితే 24న రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన `ముద్దుల ప్రియుడు` అనే సినిమా షూటింగ్ కి అర్జెంటుగా రమ్మన్నారు. అయితే నాతో నా భార్య ని, అమ్మని కూడా షూటింగ్ కి తీసుకు వచ్చాను. ఇక షూటింగ్లో రెండు గంటలు బ్రేక్ దొరికింది. ఆ సమయంలోనే ఫస్ట్ నైట్ జరిగింది.. అంటూ ఆలీ చెప్పకు వచ్చాడు. ఇలా ఆలీ చెప్పిన టాప్ సీక్రెట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest