బన్నీ ఫ్యాన్స్‌కు బంప‌ర్ న్యూస్‌… హిట్ కాంబినేష‌న్ రిపీట్‌…!

ఐ కాన్ స్టార్ అల్లుఅర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో జులాయి సినిమా నుండి మొన్న వచ్చిన అలా వైకుంఠపురం సినిమా వరకు వీరి కాంబోలో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్టు ఒక వార్త బయటకు వచ్చింది.

Suryadevara Naga Vamsi

స్వాతిముత్యం సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న నాగ వంశీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. స్వాతిముత్యం మూవీ ప్రమోషన్ లో భాగంగా వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందని ఆయన ప్రకటించారు. త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే అల్లుఅర్జున్ తో తన కొత్త సినిమా మొదలు పెడతాడని నాగ వంశీ పేర్కొన్నాడు.

Tollywood: Allu Arjun and Trivikram Srinivas to reunite in 2023

త్రివిక్రమ్ బన్నీ కోసం కథను కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది. బన్నీ త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమాను నాగ వంశీ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.