నందమూరి ఫ్యాన్స్ కి షాకిచ్చిన మోక్షజ్ఞ.. ఫోటోలు వైరల్..!!

టాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోలు వారి వారసులను రంగంలోకి దించారు. వారందరూ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే సీనియర్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ మాత్రం వారసుడిని ఇంకా రంగంలోకి దించలేదు. టాలీవుడ్ లో బాలయ్యకున్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాల‌య్య‌ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. గత సంవత్సరం అఖండ సినిమాతో టాలీవుడ్ కి తిరుగలేని కంబ్యాక్ హిట్ ఇచ్చాడు. బాలకృష్ణ సినిమాలు తో పాటు ఆహా లో అన్ స్టాపబుల్ షో తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. రీసెంట్గా అన్ స్టాపబుల్ సీజన్ 2 షూటింగ్ కూడా మొదలైంది.

Nandamuri Mokshagna | Antti..is there no chance of Mokshagna's entry as a  hero..?

ఇక ఇప్పుడు నందమూరి అభిమానుల అందరి చూపు మోక్షజ్ఞ ఎంట్రీ పైనే పడింది. మోక్షజ్ఞ సినిమాలలో నటిస్తే చూడాలని నందమూరి అభిమానులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు.గత కొంతకాలం నుండి మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడంటూ వార్తలు చాలా వస్తున్నాయి. ఇలాంటి వార్తలపై ఇంకా అధికార ప్రకటన రాలేదు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి ఇంకా అలాంటి ప్రస్తావన లేదు. రీసెంట్గా బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో మోక్షజ్ఞ కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. ఆ ఫంక్షన్ లో మోక్షజ్ఞ చాలా కొత్తగా కనిపించాడు. మళ్లీ అప్పటినుంచి మోక్షజ్ఞ సినిమా వచ్చేస్తుంది అంటు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా మోక్షజ్ఞ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విషయానికి వస్తే మోక్షజ్ఞ హైదరాబాదులో AMBలో నిన్న సందడి చేశాడు. అయితే అక్కడికి మోక్షజ్ఞ కుటుంబ సభ్యులతో అతని స్నేహితులతో కాకుండా ఒంటరిగా థియేటర్ కి మోక్షజ్ఞ వచ్చాడు. అయితే అక్కడ ఉన్న కొందరు మాత్రం మోక్షజ్ఞను గుర్తుపట్టి ఫోటోలు తీసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. మోక్షజ్ఞకు ఎదురు వచ్చిన అభిమానులను పలకరించుకుంటూ థియేటర్లోకి వెళ్లిపోయాడట. మోక్షజ్ఞ AMB లో సినిమా చూసేందుకు వచ్చిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.