నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్ లో ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా దూసుకుపోతున్నాడు. ఇటు రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా బాలయ్య టాప్ ప్లేస్ లో ఉన్నాడు. గత సంవత్సరం అఖండ సినిమాతో బాలకృష్ణ అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం తన 107వ సినిమా ఆయన వీర సింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాలతో పాటు బాలకృష్ణ ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం ఆహాలో వచ్చిన అన్ స్టాపబుల్ షో తో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా బాలయ్య అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఈ నెలలోనే ప్రారంభమైంది. ఈ సీజన్ లో కూడా బాలయ్య రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు.
ఈ క్రమంలోనే బాలకృష్ణ ఎవరు ఊహించని విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు సినిమాలతో ఆహా షో తో బిజీగా ఉన్న బాలకృష్ణ.. కమర్షియల్ యాడ్ రంగంలో కూడా దుమ్ము లేపడానికి బాలకృష్ణ రాబోతున్నాడు. ఆయన సాయి ప్రియ కన్స్ట్రక్ షన్స్ తరఫున ఓ కమర్షియల్ యాడ్ లో నటించారు. ఈ యాడ్ కు సంబంధించిన వీడియో ఈరోజు రాత్రికి విడుదల చేయనున్నారు. బాలకృష్ణ తన 40 సంవత్సరాల సినీ కెరియర్లో ఇప్పటివరకు ఏ కమర్షియల్ యాడ్‌లో ఆయన నటించలేదు. ఆయన నటించబోయే తొలి కమర్షియల్ యాడ్ ఇది. ఈ యాడ్ తో బాలకృష్ణ మరిన్ని సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి..!!