కమల్ హాసన్ వద్దనుకున్న పాత్రలో నటించిన బాలకృష్ణ.. ఆయన తల రాతనే మార్చేసిన సినిమా ఇదే.!!

తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఆయన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించాడు. ఆయన ఎన్ని సినిమాలలో నటించిన ఆయన సినిమాలలో ప్రత్యేకమైన స్థానం తెచ్చుకున్న చిత్రం ఆదిత్య 369. ఈ సినిమాను సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు 20 ఏళ్ల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేకుండా టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో సైంటిఫికల్ గా ఈ సినిమాను ఎంతో గొప్పగా తెరకెక్కించాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలలో నటించాడు.మొదటి పాత్ర కృష్ణ కుమార్ గా ప్రస్తుత కాలంలో నడిచే క్యారెక్టర్ లో నటించి అందర్నీ మెప్పించాడు. రెండో క్యారెక్టర్ లో శ్రీకృష్ణదేవరాయలుగా ఎంతో గొప్పగా నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ టైంలో బాలకృష్ణ సినిమాలు అంటేనే పవర్ఫుల్ యాక్షన్ ఫైట్లతో డైలాగులతో ఉంటాయి. అలాంటి ఏవి లేకుండా సినిమాను తెరకెక్కించి… బాలకృష్ణకు సూపర్ హిట్ ఇచ్చాడు సింగీతం శ్రీనివాస రావు.

సింగీతం శ్రీనివాస రావు ఈ సినిమాను మల్టీ స్టార్ సినిమాగా తీయాలనుకున్నాడట. ఇందులో వచ్చే శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్ ను కమల్ హాసన్ తో నటింపచేయాలని ఆయన అనుకున్నాడట. కమలహాసన్ కూడా సింగీతం శ్రీనివాస రావుతో నటించాలని కోరిక ఉందట. ఆ టైంలో ఆయన డేట్లు సర్దుబాటు కాకపోవటంతో… కమల్ హాసన్ ఆదిత్య 369 సినిమాలో నటించలేకపోయాడు.

ఆ తర్వాత దర్శకుడు ఇతర హీరోలను ఈ సినిమాలో నటింపజేయాలని చూసిన.. ఎవరు ఒప్పుకోకపోవడంతో ఆపాత్రాన్ని కూడా బాలకృష్ణ తోనే చేయించారు. ఆ పాత్రలో బాలకృష్ణ తాను తప్ప ఎవరు చేయలేనంతగా గొప్పగా ఆ పాత్రలో ఆయన నటించారు.. ఒకవేళ ఈ సినిమాలో కమల్ హాసన్ ఆ క్యారెక్టర్ లో నటించి ఉంటే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదల చేయాలని సంగీతం ఆశపడ్డారట. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని బాలయ్య కృష్ణ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సీక్వెల్ లో ఆయన కుమారుడు మోక్షజ్ఞ కూడా నటిస్తారని తెలుస్తుంది.