నా చుట్టూ అలాంటి వాళ్లే ఉన్నారు.. విష్ణు ప్రియ షాకింగ్ పోస్ట్ వైరల్!

తెలుగు బుల్లితెరపై ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినా ఈటీవీ ప్లస్ లో ప్రసారమయిన‌ `పోవే పోరా` కార్యక్రమం ద్వారా యాంకర్ గా విష్ణుప్రియ భీమినేని తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఆ షో తో విష్ణుప్రియ యాంకర్ గా మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈమె బుల్లితెర పైనే కాకుండా వెండి తెరపై కూడా కనిపించాలని చాలా ప్రయత్నాలు చేసింది.

అయినప్పటికీ ఏ విధమైన అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ తనదైన స్టైల్ లో అభిమానులను సందడి చేస్తుంది. ఇటీవల తాజాగా డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో `వాంటెడ్ పండుగాడు` అనే సినిమాలో విష్ణుప్రియ నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా హిట్ కావకపోవడంతో విష్ణు ప్రియకి నిరాసే ఎదురయింది. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో కలిసి విష్ణుప్రియ “జారే జారే పంచ“ అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను అలరించింది.

ఇక ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అయింది. అయితే ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఎంతగానో అలరిస్తున్న విష్ణు ప్రియ తాజాగా ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఏమిటంటే `మన చుట్టూ ఉన్న కొంతమంది ఏం మాట్లాడినా మనకు అర్థం కాదు.. అలాగే మనం ఏం మాట్లాడకపోయినా అర్థం చేసుకునే వారు కూడా ఉంటారు` అనే కొటేషన్ ను షేర్ చేసింది. అలా విష్ణు ప్రియ తన చుట్టూ కూడా అలాంటి వాళ్లే ఉన్నారంటూ ఈ పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. అయితే తాను మాట్లాడకపోయినా తన మనస్తత్వాన్ని, తన పిచ్చిని, తిక్కను అర్థం చేసుకునే కొంతమంది స్నేహితులు ఉన్నారంటూ.. తన స్నేహితుల గురించి ఎమోషనల్ అవుతూ ఈ పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు విష్ణుప్రియ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.