ఎన్టీఆర్ తో నటించనని తెగేసి చెప్పిన స్టార్ హీరోయిన్ కారణం..?

స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నారు. అంతేకాదు రాజకీయ రంగ ప్రవేశం చేసి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశారు అంటే ఇక అటు సినీ ప్రేక్షకులలో, ఇటు ప్రజలలో ఆయనపై ఎంత నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమాలు చేసే సమయంలో క్రమశిక్షణతో ఉండాలనేది ఆయన పద్ధతి. ఎవరైనా సరే సినిమా షూటింగుకు సమయానికి రాకపోతే ఇక పరిణామం కూడా అదే రేంజ్ లో ఉండేది. ముఖ్యంగా నిర్మాతల మనిషి అని ఎన్టీఆర్ ను అందరూ చెప్పేవారు. ఇక ఏ రోజు కూడా పారితోషకం విషయంలో కానీ బడ్జెట్ విషయంలో కానీ నిర్మాతలను ఇబ్బంది పెట్టింది లేదు.Dhanama Daivama Telugu Movie Songs - Rama Sree Rama - NTR, Jamuna - YouTube

ఇక ఇలాంటి గొప్ప నటుడు సినిమాలో ఒక చిన్న పాత్ర చేసినా చాలు అని ఆలోచించే నటీనటులు కూడా ఉంటారు. కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఎన్టీఆర్ సినిమాలో నటించనని తెగేసి చెప్పేసింది. అసలు విషయం ఏమిటంటే..1974లో సీనియర్ ఎన్టీఆర్ , దాసరి నారాయణరావు కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉంది. కుదరవల్లి లక్ష్మీనారాయణ నిర్మాణంలో దాసరి ఎన్టీఆర్ కు రెండు కథలు చెప్పగా ఒక కథ ఆయనకు చాలా నచ్చింది. ఇక ఆ సినిమాలో నటించడానికి ఎన్టీఆర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కుదరవల్లి లక్ష్మీనారాయణ మాత్రం కొన్ని కారణాల వల్ల సినిమాను నిర్మించడం సాధ్యం కాలేదు.The Legend and the Legacy of Dasari Narayana Rao

ఇక ఆ తర్వాత డి వి ఎస్ రాజు నిర్మాతగా ఒక కథ చెప్పడానికి వెళ్ళగా.. దాసరి చెప్పిన మరో కథ కూడా ఎన్టీఆర్ కు బాగా నచ్చింది. అయితే ఆ సినిమాలో తల్లి పాత్ర చాలా కీలకం. మరి ఆ తల్లి పాత్ర కోసం నిర్మాతలు హీరోయిన్ జమునను సంప్రదించారు. కానీ ఆమె తల్లి పాత్రలు చేయడానికి ఓకే చెప్పకపోవడంతో ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. ఇక ఎన్టీఆర్ కి తల్లిపాత్రలో నటించడానికి జమున అంగీకరించలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ , దాసరి కాంబినేషన్లో మనుషులంతా ఒకటే సినిమా రాగా ఆ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. అందులో జమున, మంజుల హీరోయిన్లుగా నటించారు.