విశాఖ సిటీ..ఫిఫ్టీ-ఫిఫ్టీ…!

విశాఖ అంటే మొదట నుంచి టీడీపీకి కంచుకోట అని చెప్పొచ్చు…ఈ జిల్లాలో టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి…కానీ గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ భారీగా నష్టపోయింది. కానీ సిటీలో మాత్రం టీడీపీ సత్తా చాటింది. జిల్లాలో 15 స్థానాలు ఉంటే…వైసీపీ 11 సీట్లు గెలిస్తే…టీడీపీ 4 సీట్లు గెలుచుకుంది. ఆ నాలుగు కూడా విశాఖ నగరంలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లు. ఇందులో సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీ వైపుకు వెళ్లారు.

పైగా నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు…టీడీపీలో యాక్టివ్ గా లేరు…అసలు ఎమ్మెల్యేగా పనిచేయడం లేదు…నియోజకవర్గంలో తిరగడం లేదు. దీంతో నార్త్ లో టీడీపీ పరిస్తితి బాగోలేదు. ఇలా సిటీలో టీడీపీ బలం కాస్త తగ్గింది. ఈ సారి నాలుగు సీట్లని టీడీపీ గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇటీవల వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో ఉమ్మడి విశాఖలో టీడీపే మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది.

విశాఖ ఈస్ట్, వెస్ట్, గాజువాక, భీమిలి, పెందుర్తి, నర్సీపట్నం సీట్లు టీడీపీ…పాడేరు, అరకు, ఎలమంచిలి, విశాఖ నార్త్, మాడుగుల సీట్లు వైసీపీ గెలుచుకుంటుందని తేలింది. ఇక పాయకరావుపేట, విశాఖ సౌత్, అనకాపల్లి, చోడవరం సీట్లలో రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని తెలిసింది. అయితే పాయకరావుపేటలో టీడీపీకి ఎడ్జ్..మిగిలిన మూడు సీట్లలో వైసీపీకి ఎడ్జ్ ఉందని తేలింది.

ఇక్కడ సిటీ విషయానికొస్తే నార్త్, సౌత్ సీట్లని టీడీపీ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్ సీట్లని మాత్రం మళ్ళీ గెలుచుకునే ఛాన్స్ ఉంది. అంటే విశాఖ సిటీ ఫిఫ్టీ-ఫిఫ్టీ అన్నట్లు ఉంది. కాకపోతే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. టీడీపీ-జనసేనతో పొత్తు ఉంటే మళ్ళీ వైసీపీకి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే సిటీలో జనసేనకు కాస్త బలమైన ఓటు బ్యాంక్ ఉంది. కాబట్టి ఈ సారి విశాఖ సిటీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.