వావ్: RRR కొత్త పోస్టర్ చూశారా..అద్దిరిపోయిందిగా..!!

దర్శకు ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచిక్రేజ్‌ను తీసుకొచ్చాడు. ఆయన తర్వాత బిగ్గెస్ట్ యాక్షన్ మల్టీస్టారర్ సినిమాగా త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రాజమౌళిని మరో మెట్టు తీసుకువెళ్ళింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మంచి విజయాన్ని సాధించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఇమేజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ నటనకు ఆస్కార్ నామినేషన్ లో నామినేట్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి.

Image

ఈ సినిమా ప్రపంచ దేశాల్లో విడుద‌లై మంచి కలెక్షన్లను రాబట్టి మంచి పేరుని కూడా తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా జపాన్ వెర్షన్ కి సంబంధించిన మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఆ పోస్టర్ తెలుగు వెర్షన్ కి భిన్నంగా చాలా కొత్తగా ఉంది. పోస్టర్ ని చూసిన అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జపాన్‌లో త్రిబుల్ ఆర్ అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతుండగా అక్కడ ఎలాంటి కలెక్షన్లు రాబోతుందా అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share post:

Latest