స్టార్ డాటర్ ని ఓ రేంజ్ లో పొగిడేసిన ప్రభాస్..మ్యాటర్ తేడా కొడుతుందే..!?

లోక నాయకుడు కమలహాసన్ కూతురుగా సిని పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతిహాసన్. తన కెరియర్ మొదటలో ఆమె చేసిన సినిమాలు అన్ని ప్లాప్ కావడంతో ఐరన్ లెగ్ హీరోయిన్ అనే ముద్రను వేసుకుంది. అలా కొన్నాళ్లపాటు తన కెరియర్ లో చాలా ఇబ్బందులు పడింది.ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్‌ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో తన ఐరన్ లెగ్‌ అనే ముద్ర‌ను తొలగించుకుని స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ వచ్చింది.

Shruti Haasan Birthday special: 7 unknown facts about the actress that will  leave you stunned

శృతిహాసన్ సినిమాలలోనే కాకుండా మల్టీ టాలెంటెడ్ గా తన చిన్న వయసు నుంచి డాన్సులతో పాటలు పాడుతూ తన టాలెంట్ ని బయట పెట్టేది. తన తండ్రి హీరోగా వచ్చిన ఈనాడు సినిమాకి శృతిహాసన్ స్వయంగా మ్యూజిక్ అందించింది. దీంతోపాటు హీరో ధనుష్ తో కలిసి కొలవరి కొలవరి సాంగ్ పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఎడ్జ్ అనే మ్యూజిక్ ఆల్బమ్ వీడియో చేసి అందరినీ ఆకట్టుకుంది.

Salaar Motion Teaser & Starcast, Prabhas, Shruti Hassan, Prasanth neel,  Salaar Teaser, #Salaar - YouTube

ఇప్పుడు శృతిహాసన్ తనలోని ఇంకో యాంగిల్‌ను బయటపెట్టింది తనే స్వయంగా లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన షీ ఇస్ హీరో అనే స్పెషల్ వీడియో సాంగ్‌ను పాడి తన సొంత యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఆ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. అంతే కాదు అంతేకాదు శృతిహాసన్ ని ప్రభాస్ ఓ రేంజ్ లో పొగిడేసాడు. దానికి కారణం ప్రభాస్ శృతిహాసన్ కలిసి సలార్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2023 సెప్టెంబర్‌లో విడుదల చేస్తామ‌ని మేకర్స్ తెలిపారు. ఇక సోషల్ మీడియాలో ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Share post:

Latest