టీడీపీ లో వివాదాలకు దారి తీసిన ఎన్టీఆర్ ట్వీట్..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతోంది.. ఇలాంటి సమయంలోనే జగన్ సర్కార్ అందరి దృష్టి మళ్లించడానికి విజయవాడలోని వైద్య విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తీసివేసి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం తో ఇప్పుడు ఎక్కువగా ఈ విషయం వైరల్ గా మారుతోంది. అయితే ఇలా పేరు మార్చడంతో కొంతమంది సినీ ప్రేమికులు రాజకీయ నాయకులు సైతం తోచిన విధంగా స్పందిస్తూ ఉన్నారు. ఇక వీరితో పాటు నందమూరి కుటుంబం కూడా స్పందించడం జరిగింది.

Cyclone Hits The Coast Of Jr NTR

ఇకపోతే ఈ విషయంపై వైసీపీ లో కంటే టిడిపి లోనే ఎక్కువ వార్ నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పేరు తీసివేయడం పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపట్ల కొంతమంది టీడీపీలో అలాగే నందమూరి అభిమానులలో కూడా కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ మీద వివిధ అంశాలలో ఒక వర్గం వ్యతిరేకం చూపడం కూడా తెలిసింది.. ఇక ఎన్టీఆర్ తన తాత పేరు పెట్టుకుని ఇప్పుడు ఆయన పేరు మార్చిన విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించడంతో గట్టిగానే ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. అంతేకాకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి కూడా సానుకూలంగా మాట్లాడడంతో ఈ విషయం పలు విధాలుగా చర్చనీయాంశంగా మారింది.

Has TDP decided to close doors for Jr NTR?
ఈ విషయంపై కొంతమంది టిడిపి వర్గాల నుంచి కాస్త అసంతృప్తి వ్యక్తం అవుతుందని సమాచారం. గతంలో పార్టీ కోసం ఎన్టీఆర్ సేవల్ని వాడుకొని ఆ తర్వాత అతడిని పక్కకు నెట్టి వేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ ఒకవైపు రాజకీయంగా మరొకవైపు సినిమా పరంగా తొక్కడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకట్టు వేస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. అలాంటప్పుడు ఎన్టీఆర్ స్పందించిన తీరుపై ఎందుకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో తెలియదని ఎన్టీఆర్ అభిమానుల సైతం భావిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు నందమూరి అభిమానులు టిడిపి అభిమానులు పెద్ద చిచ్చు ఏర్పడిందని చెప్పవచ్చు.