బ్ర‌హ్మాస్త్ర ఈవెంట్‌లో చిరంజీవికి తార‌క్ పంచ్‌… ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌…!

ఎన్టీఆర్ శుక్రవారం హైదరాబాదులో జరిగిన బ్రహ్మాస్త్రం మూవీ ప్రెస్ మీట్‌కు ముఖ్యఅతిథిగాా హాజరయ్యారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, నాగార్జున వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ దిగ్గజ ప్రొడ్యూసర్‌లు ఈ సినిమాని నిర్మించారు. సౌత్ లో రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా పోన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా శుక్రవారం నాడు రామోజీ ఫిలిం సిటీ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈవెంట్ నిర్వహణ కోసం చివ‌రి నిమిషంలో దరఖాస్తు చేసుకోవడంతో బందోబస్తు కల్పించలేమని పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో చివరి నిమిషంలో అక్కడ వేడుకను రద్దు చేసుకునే తర్వాత హైదరాబాదులోని పార్క్ హైత్‌ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

Brahmastra Telugu Pre-release Event Highlights

ఈ ఈవెంట్ లో తారక్ మాట్లాడుతూ..”ప్రపంచ స్థాయిలో సినిమా పరిశ్రమ ఎప్పుడూ ఒత్తిడికి గురవుతుంది. అభిమానులు సినీ ప్రేక్షకులు మనం ఇప్పుడు చేస్తున్న సినిమాలు కంటే కొత్తగా ఇంకేదోదో కావాలని కోరుకుంటున్నారు. ఇది నేను నమ్ముతాను.. దీనివల్ల మనం పట్టుదలతో బాగా పనిచేస్తామని నేను నమ్ముతాను. సినిమా ఇండస్ట్రీలు మొత్తం ఈ సవాలను తీసుకోవాలి దీనివల్ల సినిమా పరిశ్రమ నుండి గొప్ప సినిమాలు వస్తాయి అని నేను భావిస్తున్నా ఈ విషయంలో ఎవ్వరిని తప్పు పట్టకూడదు..”అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

తాజాగా ఎన్టీఆర్ బ్రహ్మాస్త్ర ప్రెస్ మిట్‌ లో మాట్లాడిన మాటలు చూస్తే చిరంజీవికి కౌంటర్ ఇచ్చేలా ఉన్నాయని అంటున్నారు జనాలు. ఎన్టీఆర్ ఇప్పుడు కొర‌టాల శివ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారని విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు అన్ని కొరటాలకు ధైర్యం ఇచ్చేలా ఉన్నాయంటు.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిస్తున్నాయి.

Share post:

Latest