బాల‌య్య రికార్డును ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా…. ఆ రికార్డ్ ఇదే…!

ప్రెజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ – రిలీజ్ ట్రెండ్ సెన్సేషనల్ గా మారింది. అభిమానులు కూడా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌కి బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు`పోకిరి` సినిమాతో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ `జల్సా` సినిమా.. ఇటీవల బాలకృష్ణ `చెన్నకేశవరెడ్డి` సినిమా కూడా రీ రిలీజ్ అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ `జల్సా` సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసిన నేపథ్యంలో ఆ రికార్డును తాజాగా బాలకృష్ణ `చెన్నకేశవరెడ్డి` సినిమా ఆ రికార్డ్ బ్రేక్ చేసింది.

ఇప్పుడు `చెన్నకేశవ రెడ్డి` సినిమా రికార్డును అదే నందమూరి ఫ్యామిలీ కి చెందిన ఎన్టీఆర్ తన `ఆది` సినిమాతో రికార్డును బ్రేక్ చేసేందుకు త్వరలోనే రెడీ అవుతున్నట్లు సమాచారం. `ఆది` సినిమా విడుదలై 21 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే గత ఏడాది 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంబరం భారీగానే జరిగింది. గ‌తేడాది ఫ్యాన్స్ కోసం మాత్రమే సినిమాను ప్రదర్శించారు.. కానీ ఎక్కువ స్థాయిలో ప్రచారం చేయలేదు.

ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈసారి మాత్రం `ఆది` సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. అందుకే `ఆది` సినిమా రి-రిలీజ్ కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇప్పటికే బెల్లంకొండ సురేష్ అధికారకంగా ప్రకటించారు. నవంబర్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు మళ్లీ `ఆది` సినిమాను తీసుకొస్తున్నట్టు చెప్పాడు. అప్పట్లో ఎన్టీఆర్ సరిగా మీసాలు రాకుండానే `ఆది` సంచలన విజయాన్ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ హిట్ దక్కించుకోవడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపడేలా చేసింది.

ఈ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఎన్టీఆర్ `ఆది` సినిమా రీ రిలీజ్ చేసి మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే కచ్చితంగా ఎన్టీఆర్ యొక్క అభిమానులు కలెక్షన్స్ వర్షం కురిపించడం ఖాయం. ఇక దాంతో బాబాయ్ బాలకృష్ణ `చెన్నకేశవరెడ్డి` సినిమా రికార్డ్ బ్రేక్ అవుతుంద‌ని నంద‌మూరి అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.