‘ గాడ్ ఫాథ‌ర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌తో టాప్ లేపేస్తోన్న చిరు… !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహ‌న్ రాజా దర్శకత్వంలో రూపొందించిన లేటెస్ట్ సినిమా `గాడ్ ఫాదర్`. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన‌ ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అయి అభిమానులను అలరించబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో `గాడ్ ఫాదర్` సినిమాపై భారీ హైప్ రావడంతో ఈ సినిమాపై మరెన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా హిందీ – తెలుగు ఓటిటి హక్కులు భారీ ధ‌ర‌కు అమ్ముడు పోగా ఇప్పుడు ఓవరీస్ బిజినెస్ కి సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి హిందీ, తెలుగు లాంగ్వేజెస్‌ కలిపి ఓవరీస్ లో 2 మిలియ‌న్ల టార్గెట్ సెట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆచార్య సినిమా అందుకున్న ఫలితంతో పోలిస్తే ఇది తక్కువ అయినా రీమేక్ సినిమా కావ‌డంతో ఇది మంచి ఫిగ‌రే..!

Share post:

Latest