మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరో సీజన్లో యావరేజ్ టీఆర్పితో నడుస్తోంది. అయితే బిగ్ బాస్ సీజన్ 6 రోజురోజుకి మరింత ఆసక్తిగా మారుతుంది. ఈ సీజన్ లో కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వీకెండ్స్ లో నాగార్జున ఆటలో ఫైర్ చూపించటలేదని.. కంటెస్టెంట్లు సోమరితనంతో ఉంటున్నారని సీరియస్ అవ్వగా ఇక హౌస్ మేట్స్ ఊరికే ఉంటారా రెచ్చిపోయారు.
దానికి ఉదాహరణ కాప్స్ వర్సెస్ దొంగ టాస్క్ లో మంచి ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులకు సాలిడ్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఆ టాస్క్ పర్ఫామెన్స్ విషయంలో గీతు రాయల్, శ్రీహాన్ – రేవంత్ టాప్ పొజిషన్లో ఉన్నారు. అయినా ఈ ముగ్గురు నామినేషన్స్ లో కూడా ఉన్నారు. అయితే వీరు లాస్ట్ ఎలిమినేషన్స్ లో కూడా టాప్ ఓట్లను పొంది సేవ్ అయ్యారు.
ఇక ముందు కూడా మంచి ఓట్లను పొంది అగ్రస్థానంలో ఉంటారని అభిమానులు అంటున్నారు. అయితే ప్రస్తుతానికి రేవంత్ మాత్రం దూకుడు స్వభావంతో ఉన్నప్పటికీ ఓటింగ్లో అగ్రస్థానంలో ముందున్నాడు. అయితే వీరి టాప్ స్థానాలు మిగిలిన హౌస్మెట్స్ ఎంత వరకు భర్తీ చేయగలుగుతారా అన్నది రానున్న రోజుల్లో చూడాలి.