మెగా ఫ్యాన్స్‌కు కిక్ న్యూస్‌… చిరు సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది…!

మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్టుకు క్రేజీ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో చిరంజీవికి జోడీగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా శ‌రవేగంగా జరుగుతుంది.

Chiranjeevi collaborates with Bobby for his 154th film: 'Presenting the  'Mass Moola Virat' in an avatar we love the most' | Entertainment News,The  Indian Express

 

తాజాగా జరుగుతున్న షూటింగ్‌లో మాస్ మహారాజా రవితేజ కూడా పాల్గొన్నాడు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్‌లో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ గెస్ట్ రోల్లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని ఈ సినిమా యూనిట్ మొదలు పెట్టినప్పుడే చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది.

Ravi Teja joins Megastar Chiranjeevi, Shruti Haasan for the shoot schedule  of Mega154; Mythri Movie Makers announce with a video : Bollywood News -  Bollywood Hungama

 

ఈ సినిమాను విడుదల తేదీని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారట. ఈ వార్తపై ఇంకా అధికార ప్రకటన రాలేదు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.

Share post:

Latest