అదిరిపోయిన మీమ్స్… రాముడిని కాపాడేందుకు NTR మరోసారి వెళ్ళాడు చూడండి!

ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్లగా నిలిచిన తెలుగు సినిమాలు ‘RRR’, ‘సీతారామం’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వాతంత్య్రం కోసం రామ్ – భీమ్ పోరాటం ఆకట్టుకుంటే, అచ్చమైన ప్రేమకు నిర్వచనం చెప్పేటువంటి సీత – రాముల ప్రేమ లేఖలు మరింతగా ఆకట్టుకున్నాయి. సీతారామంలో సీత – రామ్ ల మధ్య అజరమర ప్రేమ కథ సినిమా ప్రేక్షకులను అంతకు మించిన కన్నీళ్లు తెప్పిస్తుంది. సీత కోసం రామ్ చూపించే ఆరాటం..ఆ క్రమంలో రామ్ – సీతల మధ్య ప్రేమల లేఖల స్టోరీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సరిగ్గా ఇదే పాయింట్ ని బేస్ చేసుకుని మీమర్స్ ఓ రేంజ్లో రెండు సినిమాల్ని అద్భుతంగా రీ క్రియేట్ చేస్తున్నారు.

ఈ రెండు సినిమాల లవ్ స్టోరీలను మిక్స్ చేసి మీమర్స్ ఓ స్పెషల్ వీడియో తాజాగా రిలీజ్ చేసారు. రెండింటిలోనూ రామ్ కోసం సీత రాసిన లేఖల్ని చదవడం.. ఒకర్ని కాపాడబోయి బంధీగా మారడం అనే విషయాలు చాలా కామన్ గా ఉంటాయి. ఇప్పుడు సీతారామం లో రామ్ ని కాపాడేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వచ్చినట్లు వీడియోలో రీ క్రియేట్ చేసారు. తను సేఫ్ గా ఉన్నాడని నిజం చెప్పండని సీతారామంలో సీత అంటే … నా పాణం అడ్డు పెట్టైనా నీ రాముడ్ని నేను తీసుకొస్తా అని భీమ్ అంటాడు.

ఇకపోతే ఆ రెండు సన్నివేశాల సికింగ్ బాగా కుదరడంతో ఎన్టీఆర్ అభిమానులు బాగా ఖుషి అవుతున్నారు. ఇక దుల్కర్ అభిమానులు ఎలా వుంటారో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఎంతగానో వీటికి రియాక్ట్ అవుతున్నారు. రియల్ క్రియేటర్స్ ని మించి మీమర్స్ అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Share post:

Latest