మొదలైన అన్ స్టాపబుల్ షూటింగ్.. మొదటి గెస్ట్ ఎవరంటే..?

నటసింహ బాలకృష్ణ మొదటి సారి బుల్లితెరపై అడుగుపెట్టిన మొదటి షో అన్ స్టాపబుల్ విత్ ఎం బి కే.. ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకులంతా కూడా ఆహా లో వస్తున్న ఈ షో కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మొదటి సీజన్ పూర్తిచేసుకుని రెండవ సీజన్ కి సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తూన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన తాజా అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బాలకృష్ణ మొన్నటి వరకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఇక ఇటీవల హైదరాబాదులో అన్ స్టాపబుల్ షో కి సంబంధించిన షూటింగ్లో పాల్గొన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది.

Unstoppable Season 2 Coming Soon | Unstoppable with NBK | Nandamuri  Balakrishna - YouTube

సీజన్ 2 కి సంబంధించిన టైటిల్ సాంగ్ రిలీజ్ చేయగా ఇక ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం.. ఇకపోతే బాలకృష్ణపై ఒక ప్రత్యేక సాంగ్ ను సీజన్ 2 కోసం ఆహా వారు చిత్రీకరిస్తున్నట్లుగా ఇటీవల మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు నిజం కాలేదు. ఇక కేవలం బాలకృష్ణపై టీజర్ మాత్రమే చిత్రీకరిస్తున్నారు అని తెలిపారు. అయితే ఒక టీజర్ కోసం నాలుగు రోజుల సమయం తీసుకోవడం ఏంటో అంటూ అభిమానుల సైతం నిట్టూరుస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ అలాగే ఆహా టీం వారు అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ఎవరిని మొదటిసారి గెస్ట్ గా తీసుకురాబోతున్నారు అనే విషయం కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.

unstoppable with nbk 2, Unstoppable Season 2: అన్‌స్టాపబుల్-2 మొదటి అతిథిగా  మెగాస్టార్.. స్నేహితుడితో బాలయ్య సెకండ్ సీజన్! - nandamuri balakrishna  unstoppable season 2 starting with ...

ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక చాలా వరకు మెగాస్టార్ చిరంజీవిని మొదటి గెస్ట్ గా తీసుకురావడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి అన్ స్టాపబుల్ లో కనిపిస్తే బాగుంటుందని కూడా అంతా భావిస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Share post:

Latest