స్టార్ డైరెక్టర్ పై చిరంజీవి ఊహించని కామెంట్స్..అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నిన్న జరిగిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఆ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అదే సమయంలో దర్శకుడు కొరటాల శివను టార్గెట్ చేస్తూ చిరంజీవి తీవ్ర విమర్శలు చేశారు. మంచి కథ కథనంతో సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆ సినిమాలని కచ్చితంగా ఆదరిస్తారని దీనికి నిదర్శనం తాజాగా వచ్చిన బింబిసారా, సీతారామం, కార్తికేయ 2సినిమాలే అని చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిందని అన్నారు. మంచి కథతో కంటెంట్ తో సినిమా చేస్తే ప్రేక్షకులు ఆ సినిమాని హిట్ చేస్తారు. లేకపోతే రెండో రోజు ఆ సినిమాని ఇంటికి పంపిస్తారు. అదే క్రమంలో అలాంటి బాధితులను నేను కూడా ఉన్నానని… సినిమాకి డైర‌క్ట‌ర్ గుండెకాయ లాంటివాడు డైరెక్టర్.. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కావాలనుకుంటున్నారు ఎలాంటి కథలు చూడాలి అనుకుంటున్నారు అనే వాటిపై డైరెక్టర్లు దృష్టి పెట్టాలి. డైరెక్టర్లు ముందుగా ప్రేక్షకుడి లాగా ఆలోచిస్తాడు.. మీరు అలా ఆలోచించాలి. ఎవరో పెద్ద హీరో దొరికారు ఇప్పుడు తప్ప మళ్ళీ ఆయనతో సినిమా చేయలేం అనుకునే కధ కథనం సరిగ్గా లేకుండా సినిమాలు చేయకూడదు. మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరిస్తారు.

డైరెక్టర్లపై ఎందరో ఆధారపడి ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. కథ విషయంలో డైరెక్టర్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలా చేసిన రోజున సినిమా పరిశ్రమ కు ఎక్కువ హిట్లు వస్తాయని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు కొరటాలకు దగ్గరగా ఉన్నాయని.. ఆయన ఆచార్య సినిమాను సరిగ్గా తీయకపోవడం దానిని ఉద్దేశించి అన్న‌ర‌ని అర్థమవుతుంది. కొరటాలు రాసుకున్న కథ వేరు తీసింది వేరు అని చాలా వార్తలు సోషల్ మీడియా వ్యాప్తంగా వచ్చాయి.అలాకాకుండా కొరటాల గనక కథను ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసి ఉంటే మంచి హిట్ అయ్యేదని చిరంజీవి అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై కొరటాలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Share post:

Latest