చిరు ‘ గాడ్ ఫాథ‌ర్‌ ‘ ను టార్గెట్ చేస్తోందెవ‌రు…. సౌండ్ లేదే…!

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినా సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి. అయితే ఇంకో 35 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ రీలిజ్ అవ్వ‌బోతుంది. తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన‌ మోషన్ పోస్టర్లు కూడా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఇంత తక్కువ సమయం ఉన్న సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ బయటికి రావట్లేదు.

Godfather thrilling everyone

ఇదే క్రమంలో అక్టోబర్ 5న‌ నాగార్జున ఘోస్ట్ కూడా రిలీజ్ కాబోతుంది.నాగ‌ర్జ‌న‌ పుట్టినరోజు సందర్భంగా ఘోస్ట్ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. టైలర్ కొత్తగా ఉండటంవల్ల సినిమాపై ఎన్నో అంచనాలను పెంచేసింది. అది స్ట్రెయిట్ సబ్జెక్టు. అలాంటిది చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ తెలుగులో తీస్తున్నాడు. అలాంటప్పుడు మేకర్స్ చాలా జాగ్రత్తగా ప్రమోషన్స్ లో కచ్చితంగా యాక్టీవ్ గా ఉండాలి.

Chiranjeevi commences filming in Ooty for his next flick Godfather :  Bollywood News - Bollywood Hungama

గాడ్ ఫాదర్ సినిమా కమర్షియల్ సినిమానే అయినప్పటికీ చిరంజీవికి జోడీగా హీరోయిన్ లేకపోవడం ఈ సినిమాకు ఒక విధంగా మైనస్ అనే సంగతి తెలిసిందే. చిరంజీవి, సల్మాన్ కాంబినేషన్ లో వచ్చే సాంగ్ మాత్రమే ఈ సినిమాపై అంచనాలను ఒక విధంగా పెంచుతుందని చెప్పవచ్చు. తాజాగా ఇప్పుడు ఆచార్య సినిమా విడుదల ముందు జరిగినట్టు గాడ్ ఫాదర్ సినిమా కూడా జరుగుతుందనే టాక్ బయటకు వచ్చింది.

Chiranjeevi welcomes Salman Khan as they start shooting for Godfather-  “Sharing screen with you is an absolute joy” : Bollywood News - Bollywood  Hungama

ఆచార్య సినిమా విడుదల ముందు ఆ సినిమాని కాంటాక్ట్ వచ్చిన బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా ప్లాఫ్ అవుద్దని టాక్ బాగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే రకంగా గాడ్ ఫాదర్ సినిమాకి కూడా డిస్ట్రిబ్యూటర్లు బయర్లు ఈ సినిమాకి బాగా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. వేరులో అగ్ర డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు కూడా ఉండటం విశేషం. ఇప్పుడు ఇది టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది

Share post:

Latest