మారిన బాబు..జగన్ బాటలోనే?

సాధారణంగా చంద్రబాబు…పెద్ద సీనియర్ లీడర్ దగ్గర నుంచి…చిన్న స్థాయి నేత వరకు..అందరినీ ఒకే మాదిరిగా చూస్తూ ఉంటారు..అలాగే ఏమైనా తప్పులు జరిగినా సరే నాయకులని మందలించే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఎవరిని ఏమంటే ఏ ఇబ్బంది వస్తుందని చెప్పి…కాస్త సున్నితంగానే మందలిస్తారు తప్ప..ఎప్పుడు సొంత నేతల మీద ఫైర్ అవ్వరు. కానీ ఇటీవల కాలంలో బాబులో చాలా మార్పు కనిపిస్తోంది…తాను అధికార వైసీపీపై ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారో తెలిసిందే.

నెక్స్ట్ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కష్టపడుతున్నారు…నెక్స్ట్ అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందో కూడా బాబుకు తెలుసు. అందుకే వయసు పెరిగిన సరే..బాబు ఇంకా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఇక అదే తరహా రాజకీయం తమ పార్టీ నేతలు కూడా చేయలనేది బాబు కోరుకుంటున్నారు. కానీ కొందరు నేతలు..వైసీపీపై పోరాటం చేయడంలో వెనుకబడి ఉన్నారు. ఏమైనా కేసులు పెడతారనే భయం కావొచ్చు…ఇతర కారణాలు కావొచ్చు…వైసీపీపై పోరాటంలో విఫలమవుతున్నారు.

అందుకే అలాంటి వారికి తాజాగా బాబు…బాగా క్లాస్ పీకారు. ఎప్పుడూలేని విధంగా కఠినంగా మాట్లాడారు. ఆ మధ్య వైసీపీ వర్క్ షాప్‌లో జగన్…పనిచేయని నేతలకు మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని చెప్పేశారు. అదే తరహాలో పనిచేయని వారిని పక్కన పెట్టేస్తామని బాబు చెప్పేశారు. ఇక నుంచైనా ప్రజల్లోకి వెళ్ళి పోరాడాలని, కేసులు పెడితే తాము చూసుకుంటామని చెప్పుకొచ్చారు.

ఎగువ, మధ్యశ్రేణి నాయకులు బద్దకం వదలాలని, జనాల్లో తిరగాలని,  దేనికైనా సిద్ధంగా ఉండాలని బాబు పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్‌చార్జి నెలకు 20 రోజులు నియోజకవర్గంలో ఉండాలని, రెండు పార్లమెంట్‌లకు ఒక పరిశీలకుడు ఫీల్డ్‌లోనే ఉండాలని చెప్పుకొచ్చారు. అయితే సరిగ్గా ప్రజల్లోకి వెళ్లని నాయకులని నిస్సందేహంగా పక్కన పెట్టేస్తామని బాబు…టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మరి ఇక నుంచైనా టీడీపీ నేతల్లో దూకుడు పెరుగుతుందేమో చూడాలి.