చంద్ర‌బాబు టిక్కెట్ల‌ ప్ర‌క‌ట‌న టీడీపీలోనే తేడా కొట్టేసిందే…!

ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే… చంద్ర‌బాబు నాయుడు.. ఒక్కొక్క‌సారి చేసే ఆలోచ‌న లు చిత్రంగా ఉంటాయి. అదేస‌మ‌యంలో ఆయ‌న వేసే అడుగులు కూడా.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తుంటాయి. నిజానికి ఇప్పుడు ఏపీలో ఉన్న నాయ‌కుల్లో చాలా చాలా త‌క్కువ మంది మాత్ర‌మే ఆయ‌న‌కు స‌మ‌కాలికులు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా రాజ‌కీయంగా చాలా చాలా జూనియ‌ర్లు. దీంతోచంద్ర‌బాబు చేసేప్ర‌క‌ట‌న‌ల‌కు ఎక్క‌డ లేని ఆస‌క్తి ఉంటుంది.

అయితే… ఎందుకో.. ఒక్కొక్క‌సారి.. ఎమోష‌న్‌గా ఫీలై చంద్ర‌బాబు చేసే ప్ర‌క‌ట‌న‌లు.. ఇబ్బందిగా మారుతు న్నాయ‌నే టాక్ సొంత‌పార్టీలోనే వినిపిస్తున్నాయి. తాజాగా చంద్ర‌బాబు సిట్టింగులు అంద‌రికీ టికెట్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. దీనిని ఆయ‌న ఎందుకు చేశారో.. అంద‌రికీ తెలిసిందే.. త‌న స‌వాల్‌ను ఆద‌ర్శంగా తీసుకుని.. జ‌గ‌న్ కూడా 150 మంది కి టికెట్లు ఇవ్వాల‌నేది ఆయ‌న వ్యూహం. త‌ద్వారా.. ప్ర‌జ‌ల్లో ఎలానూ.. 70 మందిపై వ్య‌తిరేక‌త ఉంది కాబ‌ట్టి.. ఆ పార్టీ ఓడిపోయి.. త‌ను గెల‌వాల‌నేది.. చంద్ర‌బాబు ఆలోచ‌న కావొచ్చు.

కానీ, చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే..ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో 19 మంది మాత్ర‌మే అధికారికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు. మ‌రో న‌లుగురు వైసీపీ కి అనుకూలంగా మారిపోయారు. మ‌రి 19 మందిలోనూ.. గంటా శ్రీనివాస‌రావు.. పార్టీత ర‌ఫున ఎక్క‌డా వాయిస్ వినిపించ‌డం లేదు. ఇక‌, చంద్ర‌బాబు సొంత బావ‌మ‌రిది.. బాల‌య్య‌కు హిందూపురంలో వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని.. సొంత నివేదిక‌లే చెబుతున్నాయి. దీంతో ఆయ‌న ఇబ్బందుల్లోఉన్నారు. అస‌లు ఆయ‌న అసెంబ్లీకి కూడా రావ‌డం లేదు.

మిగిలిన వారిలోనూ.. ఒక‌రిద్ద‌రు ప‌క్క చూపులు చూస్తున్నారు. అదేస‌మ‌యంలో ప‌నిచేసేవారికి మాత్ర‌మే సీట్లు ఇస్తాన‌ని.. వారు సిట్టింగులైనా.. ఎవ‌రైనా త‌న‌కు ఒక‌టేన‌ని.. మ‌హానాడు వేదిక‌గా.. చెప్పిన మాట.. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న చిత్రంగా ఉంద‌న‌డంలో సందేహం లేద‌ని.. టీడీపీ నాయ‌కులే అంటున్నారు.

“మేం ప‌నిచేస్తున్నాం.. మాకు టికెట్ ఇవ్వొచ్చు.కానీ, ప‌నిచేయ‌ని సిట్టింగుల‌కు కూడా ఇస్తాన‌న్నట్టుగా వ్యాఖ్యానించారు. ఇక‌, ప‌నిచేసినా.. ఒక‌టే.. చేయ‌క‌పోయినా.. ఒక‌టే“ అని ఉభ‌య గోదావ‌రి జిల్లాకు చెందిన ఒక సీనియ‌ర్‌నాయ‌కుడు వ్యాఖ్యానించారు. దీనిని బ‌ట్టి చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న‌.. సొంత పార్టీలోనే ఇబ్బందిగా మారింద‌ని అంటున్నారు.