కమ్మని కాపు కాస్తున్న కల్యాణ్..!

అసలు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని…పవన్ లక్ష్యం ఒక్కటే అని అది చంద్రబాబుని సీఎం చేయడమే అని, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అని…ఇలా చంద్రబాబు-పవన్ ఒక్కటే అని చెప్పి సీఎం జగన్ దగ్గర నుంచి మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు ఈ స్థాయిలో వైసీపీ..పవన్ ని టార్గెట్ చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాస్తవానికి చూసుకుంటే పవన్ కల్యాణ్ కు పూర్తి బలమైతే లేదు…జనసేన పార్టీ గట్టిగా చూసుకుంటే ఓ 10-15 నియోజకవర్గాల్లోనే బలంగా కనిపిస్తోంది.

కానీ పవన్ గాని…చంద్రబాబుతో కలిస్తే…దాదాపు 50-60 నియోజకవర్గాల్లో ప్రభావం చూపవచ్చు. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు రావడానికి కారణం…టీడీపీ-జనసేన విడిగా పోటీ చేయడం. ఇలా రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి…దాదాపు ఓ 50 పైనే నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. అంటే ఆయా స్థానాల్లో వైసీపీకి టీడీపీపై వచ్చిన మెజారిటీ కంటే…జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. అంటే రెండు పార్టీలు కలిస్తే అప్పుడే వైసీపీకి ఇబ్బంది అయ్యేది.

అయితే ఈ సారి వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని బాబు-పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే వారు పొత్తు విషయంలో కాస్త పాజిటివ్ గా ఉన్నారు. పవన్ పదే పదే  ఓట్లు చీలనివ్వను అని అంటున్నారు. అంటే టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమైనట్లే. ఇక పొత్తు గాని ఫిక్స్ అయితే వైసీపీకి చిక్కులు తప్పవు. ఎంత కాదు అనుకున్న పొత్తు వల్ల వైసీపీకి డ్యామేజ్ తప్పదు. అందుకే వైసీపీ మంత్రులు…పవన్ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

పవన్ దత్తపుత్రుడు అని, అది కాపులు జనసేన కాదని, కమ్మల జనసేన అని, అసలు 175 స్థానాల్లో పోటీ చేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇదంతా పవన్ విడిగా పోటీ చేసేలా చేయాలనేది వైసీపీ ప్లాన్…అందుకే పవన్…కమ్మ వర్గం కోసం పనిచేస్తున్నారని, కాపులని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాపులని పవన్ కు దూరం చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ సారి వైసీపీ ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేవు…ఎంత రెచ్చగొట్టిన టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయ్యేలా ఉంది..అలాగే ఈ సారి కాపులు వైసీపీ వైపు మొగ్గు చూపడం కూడా కష్టమనే చెప్పొచ్చు.

Share post:

Latest