ఎడ్జ్ లో వైసీపీ..టీడీపీ దాటుతుందా?

ఏపీలో ఎప్పటినుంచే నెక్స్ట్ ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే చర్చ నడుస్తోంది..మళ్ళీ జగన్ గెలుస్తారా? లేక చంద్రబాబు గెలుస్తారా? లేదంటే పవన్ కల్యాణ్ ని?  ఈ సారి ప్రజలు ఆదరిస్తారా? అనే చర్చలు నడుస్తున్నాయి. అటు వైసీపీ-టీడీపీలు ఏమో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిపోతున్నాయనే విధంగా రాజకీయం చేస్తున్నాయి.

ఏదేమైనా గాని నెక్స్ట్ ఎన్నికలే అందరి టార్గెట్..అలాగే ఇటీవల పలు సర్వేలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే పలు సర్వేలు రాగా, ఆ సర్వేల్లో వైసీపీకే మళ్ళీ ప్రజలు పట్టం కడతారని తేలింది. ఇదే క్రమంలో తాజాగా వచ్చిన ఓ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీకి ఖచ్చితంగా 73 సీట్లు వస్తాయని, అలాగే టీడీపీకి 55 సీట్లు వస్తాయని తేలింది. అటు జనసేనకు 7 సీట్లు వరకు రావోచ్చని తెలుస్తోంది.

అయితే ఒక 40 సీట్లలో టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తుందని, వాటిల్లో వైసీపీ మెజారిటీ సీట్లు దక్కించుకుంటే…మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుందని అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒకటి చెబుతున్నారు…రాను రాను టీడీపీ గ్రాఫ్ పెరుగుతుండగా, వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుందని సర్వేల్లో తెలుస్తుంది. ఎన్నికల నాటికి ఈ పరిస్తితి మరింత మారితే రిస్క్ అని, కానీ ఈ పరిస్తితి మారకుండా వైసీపీ చూసుకోవాలని, అప్పుడే ఎడ్జ్ లో అయిన వైసీపీ అధికారం దక్కించుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతానికైతే వైసీపీకే ఎడ్జ్ ఉందని, దాన్ని అలాగే నిలబెట్టుకుని, మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు పైనే వైసీపీ గెలుచుకుంటే…మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ వైసీపీని దాటడానికి టీడీపీ ట్రై చేస్తుంది. కానీ అనుకున్నంత ఈజీగా వైసీపీని క్రాస్ చేయడం టీడీపీకి కష్టమని తెలుస్తోంది…అదే సమయంలో జనసేనతో గాని పొత్తు ఉంటే…టీడీపీ…వైసీపీని దాటే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం వైసీపీనే లీడ్ లో ఉంది.