బన్నీ ఫాన్స్ రామ్ చరణ్ ఫాన్స్ మధ్య వార్ పీక్స్… నేషనల్ లెవల్‌లో పరువులు తీస్తున్నారుగా?

ఇదొక దురదృష్టకరమైన కండిషన్ అని చెప్పుకోవాలి. ఏ పరిశ్రమలో అన్నా హీరోల మధ్య వైరుధ్యాలు ఎప్పుడూ వుండవు. ఎటొచ్చి ఈ ఫాన్స్ అని చెప్పుకొనేవారే గుడ్డలు చించుకుంటూ వుంటారు. కనీస బాధ్యతలేని యువకులు అనేకమంది మన సమాజంలో ఆ హీరో ఫాన్స్.. ఈ హీరో ఫాన్స్ అని చెప్పుకుంటూ హీరోల్లాగా ఫీల్ అయిపోతూ వుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే ఒకరినొకరు చంపుకొనే సంఘటనలు కూడా మనం అనేకం చూశాం. వీళ్ళ ఊళ్ళల్లో వీరు పక్క పోకిరిగా చలామణీ అవుతూ వుంటారు. దర్శకుడు త్రివిక్రమ్ అన్నట్టు వీళ్ళకి ఎమోషన్స్ తప్ప, లాజిక్స్ అనేవి తెలియవు!

ఇక అసలు విషయానికొస్తే… తాజాగా బన్నీ ఫాన్స్ రామ్ చరణ్ ఫాన్స్ మధ్య వార్ తారాస్థాయికి చేరుకొని తమతమ హీరోలను కించపరిచే విధంగా దిగజారిపోయారు. బన్నీ, రామ్ చరణ్ మధ్య ఎలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందో తెలియంది కాదు. వారు ఒకరినొకరు చాలా అభిమానించుకుంటారు.. గౌరవించుకుంటారు. కానీ అస్సలు సంబంధం లేని ఈ ఫాన్స్ అనేవాళ్ళు మాత్రం కొట్టుకు చస్తున్నారు. తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా వీరు చేసిన రచ్చ చూస్తే గనుక వారి విజ్ఞతకి అసహ్యం వేస్తుంది.

వారి వ‌ల‌న తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా నేష‌న‌ల్ లెవ‌ల్‌లోను ఆ ఇద్ద‌రు హీరోల ప‌రువు పోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండియా హీరోగా మారగా, పుష్ప సినిమాతో బ‌న్నీకి పాన్ ఇండియా ఇమేజ్ వ‌చ్చింది. ఇద్ద‌రు మెగా ఫ్యామిలీ హీరోలుగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించ‌డ‌మే కాకుండా అన్యోన్యంగా క‌లిసి మెలిసి ఉంటున్నారు. కాని అభిమానులు మాత్రం ఇద్ద‌రిని వేరు జేస్తూ మా హీరో ఎక్కువ అంటే మా హీరో ఎక్కువ అంటూ నానా ర‌చ్చ చేస్తున్నారు. గొర్రెల్లాగా కాకుండా ఒకసారి మనుషుల్లాగా ఆలోచించండి.

Share post:

Latest