లైగ‌ర్ ప్లాప్‌తో క‌న్నీళ్లు పెట్టుకున్న విజ‌య్‌… వైర‌ల్ అవుతోన్న వీడియో..!

పూరి జగన్నాథ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్. భారీ ఎక్స్పెక్టేషన్ మధ్య ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై సోషల్ మీడియా వెదిక‌గా భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ హైదరాబాద్ థియేటర్లో సినిమా చూసి బాధతో తిరిగి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన విజయ్ దేవరకొండ ఫాన్స్ చాలా బాధపడుతున్నారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డాడు సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేశాడు. యాక్టింగ్ చించేశాడు. సినిమాలో తన పాత్రలో ఎక్కడ జోష్‌ని తగ్గలేదు. మంచి కథను సెలెక్ట్ చేసుకోక‌పోవటం.. డైరెక్టర్ ఏది చెప్తే అది చేయటమే విజ‌య్‌కు మైన‌స్ అయ్యింది. ఇక పూరి జగన్నాథ్ కొంత కాలంగా వ‌రుస ప్లాపులతో ఉన్నాడు.

Pin on Vinnu

ఇస్మార్ట్ శంకర్‌తో మళ్ళీ తన క్రేజీని పెంచుకున్నాడు. తర్వాత లైగర్ సినిమాను పాన్‌ ఇండియా లెవెల్ గా తీశాడు. సినిమా రొటీన్‌కి భిన్నంగా.. చాలా దరిద్రంగా తీశాడని.. సినిమాలో అస‌లు స్టోరీయే లేదనే అంద‌రూ అంటున్నారు. ఈ సినిమా ప్లాప్‌ అవటానికి కారణం పూరియే అని విజయ్‌ ఫ్యాన్స్ పూరి జగన్నాథ్‌ని సోషల్ మీడియా వేదిక ట్రోల్ చేస్తున్నారు.

ఇక విజ‌య్ సినిమా చూసి నిరాశ‌తో బ‌య‌ట‌కు వ‌స్తోన్న ఫొటోలు, వీడియోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. అయితే విజయ్ దేవరకొండను ఫ్యాన్స్ నిన్ను విమర్శించిననోళ్లే రేపు నీకు చప్పట్లు కొడతారు. మేము కాలర్ ఎగరేసేలా నీకు మంచి రోజులు వస్తాయంటూ సోషల్ మీడియా వేదిక స‌పోర్ట్ చేస్తున్నారు.