లైగర్ మహిమ… పాపం అనన్యాతో ఒక ఆట ఆడుకుంటున్నారుగా?

బాలీవుడ్ పాలబుగ్గల సుందరి అనన్యా పాండే, ‘లైగర్’ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసిన సంగతి విదితమే. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదగాలకున్న అమ్మడుకి కరెంట్ షాక్ తగిలినంత పని అయ్యింది. సినిమా హిట్ అయ్యుంటే నిజంగా ఆమె అనుకున్న రీతిలో స్టార్ హీరోయిన్ సరసన చేరేది. కానీ అలా జరగలేదే. అయితే ‘లైగర్’ హిట్టా.? ఫట్టా.? అనే సంగతి ఇప్పుడే తేల్చలేం కానీ, అనన్యా పాత్ర మాత్రం ఈ సినిమాలో తేలిపోయిందని తేల్చేశారు తెలుగు ప్రేక్షకులు.

ఈ సినిమాలో ఆమె గ్లామర్ ఇమేజ్‌తో పూరీ మార్క్‌కి తగ్గట్లుగా నెక్స్‌ట్ లెవల్ గ్లామర్ డోస్ ఇచ్చింది. కానీ అది చాలదుగా. డెబ్యూ మూవీ అంటే దానికి కొన్ని లెక్కలుంటాయ్. అందులోనూ సినిమా ఆడియన్స్ ఆలోచనలే ఇపుడు మారిపోయాయ్. అలాంటప్పుడు ప్రాధాన్యత లేని పాత్రల్లో కనిపిస్తే ఎంతమంత్రం ఈ జనాలు పట్టించుకోరు. ఇక ఈ సినిమాకి జాన్వీ కపూర్‌ని మొదట్లో అనుకున్నారు. కానీ ఆమె ఈ సినిమాని వద్దనుకుంది. రిలీజయ్యాకా, అర్ధం అవుతోంది… జాన్వీ ముందు జాగ్రత్తగానే ఈ సినిమాకి నో చెప్పేసి ఉంటుంది.

ఈ సినిమాలో అస్సలు ప్రాధాన్యత లేని పాత్ర పోషించింది అనన్యా. యాక్టింగ్‌కి స్కోపే లేని చోట ఆమెని నటించమంటే ఎలా ఉంటుంది చెప్పండి? స్క్రీన్‌పై కనిపించిందే చాలా తక్కువ సమయం. ఐతే ఆ వున్న కొద్దిపాటి సమయాన్ని అనన్య సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది అని ఓ వర్గం వారు విమర్శలు చేస్తున్నారు. దాంతో, రౌడీ ఫాన్స్ అనన్యను సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Share post:

Latest