భూములపై ఇన్వెస్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోస్ వీళ్లే..!!

సాధారణంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి చాలామంది హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఎక్కువగా భూములపై పెట్టుబడి పెట్టి అధిక లాభం పొందుతున్న విషయం తెలిసిందే. ఇక నాటి నుంచి నేటి వరకు ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తోంది.. ఎన్టీఆర్ ను మొదలుకొని నేటితరం కొత్త హీరోల వరకు ఇదే పద్ధతి ఫాలో అవుతూ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని 20 సంవత్సరాలు క్రితం 10,000 రూపాయల విలువ చేసే భూములు ప్రస్తుతం 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ రేటుకు అమ్మడుపోవడం తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పల్లె ప్రాంతాలలో కూడా భూముల విలువ బాగా పెరిగిపోయింది. అందుకే స్టార్ హీరోలు కూడా ఇలా భూములపై ఇన్వెస్ట్ చేస్తూ మంచి లాభాలను వెనకేసుకుంటున్నారు. ఇకపోతే నాటి నుంచి నేటి వరకూ హీరోలు ఎవరెవరు భూములపై ఇన్వెస్ట్ చేశారో మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.Top 10 Telugu Actors - VFB

ఒక మురళి మోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను వ్యాపారవేత్తను.. సినిమాలు కూడా చేస్తున్నాను.. అయినా నచ్చిన సినిమాల హక్కులను కొనుగోలు చేసేవాడిని.. రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలకు కూడా నేను షేర్ హోల్డర్ గా ఉన్నాను అని మురళీమోహన్ వెల్లడించారు. ఇకపోతే హైదరాబాద్లో ఒకటి, విజయవాడలో ఒకటి డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు కూడా ఉన్నాయని మురళీమోహన్ వెల్లడించారు.. శోభన్ బాబు గారి ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేస్తున్నానని కూడా తెలిపారు మురళీమోహన్.Telugu Heroes, Star Of The Decade

ఇక మురళీమోహనే కాదు గతంలో ఎన్టీఆర్ , ఏఎన్నార్, శోభన్ బాబు కూడా ఇలా భూములపై ఇన్వెస్ట్ చేసి మంచి లాభాన్ని పొందారు. ఇక ఈ తరం హీరోల విషయానికొస్తే.. చిరంజీవి , జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు , అల్లు అర్జున్ కూడా ల్యాండ్స్ పై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఆ లాండ్స్ భారీగా పెరగడంతో వారు కూడా భారీగా లాభాలను వెనకేసుకుంటున్నారు అని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.. ముఖ్యంగా భూములపై ఇన్వెస్ట్ చేస్తే కళ్ళు చెదరలా మాత్రం సొంతం చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

Share post:

Latest