శ్రీలీల మడతపెడితే ఉంటాది..నా సామీరంగ పైకి లేవాల్సిందే..!?

శ్రీలీల..సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అంత కుర్ర బ్యూటీలదే రాజ్యం అయిపోతుంది. నిన్న కాక మొన్న వచ్చిన ఈ కుర్ర బ్యూటీలంతా ఎప్పటినుంచో ఉంటున్న స్టార్ హీరోయిన్స్ ని ఒక్క సినిమాతోనే వాళ్ల పేర్లు మర్చిపోయేలా చేస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీస్ కొంతకాలంగా ఇండస్ట్రీలో ఉంటున్న స్టార్ హీరోయిన్లను ఒక్క సినిమాతోనే మైమరిపించేస్తున్నారు. ఆలిస్ట్ లోకి వస్తుంది శ్రీలీల.. యంగ్ బ్యూటీ కృత్తి శెట్టి . అఫ్కోర్స్ కృత్తి శెట్టి ఇప్పటికే ఐదు సినిమాల్లో నటించింది. అందులో మూడు సినిమాలు హిట్ అవ్వగా రెండు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఇప్పుడు కృతిశెట్టిని అందరు ఐరన్ లెగ్ అంటున్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఆశలన్నీ శ్రీలల పైనే పెట్టుకొని ఉన్నారు కుర్రాళ్ళు.

ప్రజెంట్ అమ్మడు చేతిలో ఐదు బడా ప్రాజెక్టులు ఉన్నాయి . ఇప్పటివరకు శ్రీలీల చేసిన సినిమా రిలీజ్ అయింది ఒక్కటే. పెళ్లి సందడ్ అది కూడా యావరేజ్ కూడా కాదు బిలో యావరేజ్. కానీ ఆమె అందాలు ఈ సినిమాలో కుర్రాలను ఆకట్టుకున్నాయి. దీంతో అమ్మడుకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. బిగ్ స్టార్స్ కూడా తమ సినిమాలో శ్రీలీల ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో శ్రీ లీల బాలయ్యకు కూతురుగా నటిస్తుంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. డైరెక్టర్ శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్న మరో సినిమా ధమాకా.

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ సినిమా అంటేనే మాస్ ఇరగదీస్తారు. ఆ రేంజ్ లోనే ఉంటుంది సినిమా. ఇక మాస్ హీరోకి యంగ్ బ్యూటీ జత కడితే అబ్బో దాని గురించి మాటల్లో చెప్పలేను. ఇక అంతా జింతక్కజితజిత అని అంటున్నారు రవితేజ ఫాన్స్. టాలీవుడ్ క్రేజీ హీరో రవితేజ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు నటిస్తూ అన్ని ఫ్లాప్ లు ఖాతాలో వేసుకుంటున్నా ధమాకా సినిమాపై మాత్రం బోలెడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో శ్రీలీల అందాలు మరింతగా ఆరబోసిన్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ బట్టి తెలుస్తుంది.

కాగా ఈ సినిమాల్లో శ్రీలీల ఓ సాంగ్ ఫుల్ మాస్ రేంజ్ లో చించేసిందని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది . అంతే కాదు గతంలో శేఖర్ మాస్టర్ హీరోయిన్ సాయి పల్లవిని నెమలిలా నాట్యం చేస్తుంది అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు. కానీ ఇప్పుడు శ్రీలలని మాత్రం మాస్ బొమ్మ అంటూ ఆమె నాలుక మడత పెడితే కుర్రాళ్ళు ఊగిపోవాల్సిందే అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సినిమాలో ఆ మాస్ పాట వస్తే థియేటర్స్ లో జనాలు సీట్లో కూర్చొని.. ఉండరని పైకి లేవాల్సిందే” అంటూ రవితేజ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ధమాకా సినిమా రవితేజకు ఎలాంటి హిట్ ఇస్తుందో.. ఆయన అభిమానులకు ఎలాంటి ఊపునిస్తుందో..?

 

Share post:

Latest