R R R కు బుల్లితెర‌పై ఘోర అవ‌మానం.. ఇంత త‌క్కువ రేటింగా…!

ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా తెరపైకి వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బ‌స్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా 14 వారాల పాటు టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సినిమాకు నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ సెల‌బ్రిటీ నుంచి కూడా ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. సినిమాలో రాజమౌళి డైరెక్షన్, మేకింగ్ అద్భుతంగా ఉంది అంటూ ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని కూడా ఎందరు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూశారు.

తాజాగా ఈ సినిమా బుల్లితెరపై స్టార్ మాలో టెలికాస్ట్ అయింది. ఈ సినిమాకి ఊహించినంత రేటింగ్ రాలేదు. ఈ సినిమాకు వచ్చిన రేటింగుతో సినీ వర్గాలు అయోమయంలో పడ్డాయి. ఈ సినిమా బుల్లితెరపై పాత రికార్డుల దరిదాపులోకి వెళ్లలేకపోయింది. త్రిబుల్ ఆర్ సినిమాకి టిఆర్పి రేటింగ్ 19.62 రావటం దారుణం అని చెప్పాలి. బుల్లితెర టాప్ టీఆర్పీ రికార్డులు చూస్తే నెంబర్ వన్ స్థానంలో అల్లు అర్జున్ అల వైకుంఠపురం 29.4 టిఆర్పి తో కొనసాగుతుంది.

Ala Vaikunthapurramuloo movie review: Allu Arjun and Trivikram Srinivas entertain us again | Entertainment News,The Indian Express

తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు 23.4 – బాహుబలి 2 22.7 – శ్రీమంతుడు 22.54 – పుష్ప 22.54 – బాహుబలి -1 21.54 – ఫిదా 21.31 – గీతా గోవిందం 20.8 – జనతా గ్యారేజ్ 20.69 టీఆర్పి లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఇక వీటిలో త్రిబుల్ ఆర్ సినిమా లేకపోవడం కొంత అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం.

దీనికి కారణం ఓటిటి ద్వారా ఈ సినిమాను చాలామంది ఇప్పటికే చాలాసార్లు చూసేశారు. ఇక టెలివిజన్లో ప్రసారమైనా అంతగా చూడడానికి ఆసక్తి చూపు లేదని ఒక టాక్ నడుస్తుంది. ఓటిటి మార్కెట్ బుల్లితెరపై ఎంతగా ప్రభావం చూపుతో మనకు ఇప్పుడు అర్థమవుతుంది.