మనదేశంలో డబ్బు ఎవరి దగ్గర బాగా వుంది అని ఎవరినైనా అడగండి.. మీకు రెండు పేర్లు వినబడతాయి. ఒకటి సెలిబ్రిటీలు, రెండు రాజకీయనాయకులు. అవును… రాజకీయనాయకుల గురించి అందరికీ తెలిసిందే. ఇక స్టార్ హీరోలను తీసుకుంటే వారు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు పడతారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వీరి పారితోషికానికి సంబంధించిన గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా దక్షిణాదికి చెందిన ముగ్గురు స్టార్ హీరోల రెమ్యునరేషన్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
అందులో ముందుగా సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి మాట్లాడుకుంటే సినిమా టాక్‌తో సంబంధం లేకుండా తొలి మూడు రోజులైతే బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది. ఆరేంజ్‌లో వెండితెరను శాసిస్తాడు కాబట్టే రెమ్యునరేషన్ కూడా చుక్కలను తాకుతుంది. రీసెంట్గా తలైవా నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ‘జైలర్’ మూవీ కోసం ఏకంగా రూ.140 కోట్లు తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. దక్షిణాదికి చెందిన హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్‌లో రజనీకాంత్ నెంబర్ వన్ అని వినికిడి. రజనీకాంత్ తర్వాత అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న హీరోలలో పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ ముందున్నాడు.
బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశాన్నంటింది. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా కోసం ఏకంగా రూ.125 కోట్లు తీసుకున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఇక వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో ‘దళపతి’ విజయ్ కూడా వున్నాడు. ‘తుపాకి’ తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా భారీ కలెక్షన్లనే రాబట్టాయి. దీంతో విజయ్ కూడా తన పారితోషికాన్ని పెంచేశాడట. తాజాగా ఆయన నటిస్తున్న ‘వారసుడు’ చిత్రానికి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బడా హీరోలు రజనీకాంత్, ప్రభాస్, విజయ్‌లు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు?
