ఆ సినిమా రాకపోయుంటే పూరీ జగన్నాధ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం అక్కర్లేదు. అత్యంత వేగంగా సినిమాలను తెరకెక్కించడంలో పూరి మంచి దిట్ట. అంతేకాదు అంతే వేగంగా విజయాలను కొల్లగొడతాడు. అంతేకాక ఈయన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తారు. అయితే విడుదలకు సిద్దంగా ఉన్న లైగర్ సినిమాలో ఓ యాక్టర్ గా చేసిన విషు రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు విషయాలను చర్చించాడు. “నేను మొదట్లో వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంటే ఏంటో నాకు తెలిసేది కాదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేదని సినిమా వాళ్ళే కాదు నా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహించే పరిస్థితి ఉండేది కాదు.” అని చెప్పుకొచ్చాడు.

ఇంకా మాట్లాడుతూ.. “నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్ సినిమాలో నటించినప్పుడు నా వయసు దాదాపు 20 సంవత్సరాలు. నేను ఆ సినిమా టైంలో ఓ వైపు పని చేస్తూనే మరో వైపు ఆడిషన్స్ ఇచ్చాను. నేను ఇతరుల జోలికి అస్సలు వెళ్ళను. కానీ ఎవరైనా నా ముందు సహాయం కోసం చేయి చాచితే లేదనకుండా ఇస్తాను. పక్క వారు నన్ను వేలెత్తి చూపే అంత పని నేను ఎప్పుడూ చెయ్యను” అని విషు రెడ్డి అన్నారు.

ఇంకా అయన మాట్లాడుతూ.. “పూరి జగన్నాథ్ గారు అంటే నాకు గురువు లెక్క. మెహబూబా సినిమా చేసే టైంలో నన్ను ఆయన కొడుకు ఆకాశ్ లాగానే చూసుకున్నారు. మెహబూబా సినిమా చేస్తున్న టైంలో కూడా పూరి జగన్నాథ్ గారికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. కానీ వాటిని బయటకి కనబడనిచ్చేవారు కాదు. కానీ ఆయన డైరెక్షన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయం అందుకున్న తర్వాత ఆయన పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ సినిమా సక్సెస్ సాధించాక పూరి జగన్నాథ్ ఏకంగా 2 కార్లు కొన్నారని విషు రెడ్డి చెప్పుకొచ్చారు.