బిగ్ షాక్: ఎన్టీఆర్ కొరటాల సినిమాకు డబ్బులు కావాలెను..!

ఇది కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ, తెలుగు చిత్ర పరిశ్రమంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రొడ్యూసర్స్‌ కి ఫైనాన్సర్‌లు దొరకటంలేదు. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి ఇబ్బందిగా మారింది. అక్టోబర్ లేదా నంబర్‌లో ఎన్టీఆర్ కొరటాల సినిమా ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ సినిమాకు ఫైనాన్స్ ఇచ్చేందుకు ఎవ్వ‌రూ ఆస‌క్తిగా లేర‌ట‌. ఎన్టీఆర్ – కొరటాల సినిమాకు ఆచార్య సినిమా విడుదల కాకుండా ఓ కంపెనీతో ఫైనాన్స్ ఎగ్రిమెంట్ అయింది.

ఆచార్య సినిమా ఎవరు అనుకోని విధంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తర్వాత పరిస్థితులు ఎవరు ఊహించిన విధంగా మారిపోయాయి. ఈ సినిమా నిర్మాత సుధాకర్ టాలీవుడ్‌కు కొత్త ప్రొడ్యూసర్. అటు కొరటాల ఇమేజ్ కూడా బాగా డామేజ్ అయింది. దీంతో ఇప్పుడు ఆ కంపెనీ ఫైనాన్స్ ఇచ్చేందుకు ముందుకు రావట్లేదని తెలుస్తుంది.

అయితే ఎన్టీఆర్ – కొర‌టాల సినిమాలో మ‌రో భాగ‌స్వామిగా ఉన్న క‌ళ్యాణ్‌రామ్ వ‌స్తేనే ఇప్పుడు వీళ్లు ఫైనాన్స్ చేస్తామంటున్నార‌ట‌. మ‌రి క‌ళ్యాణ్‌రామ్ ఇందులో ఇన్వాల్ అవుతాడో లేదో తెలియ‌దు. బడ్జెట్‌లో మొత్తం ఫైనాన్స్ ద్వారా కాకుండా కొంతైనా బయట నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ దిశ‌గా నిర్మాత సుధాకర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ కొరటాల సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కిస్తున్నారు.

Kalyan Ram and Jr NTR: The sibling bond

ఈ సినిమా కోసం కనీసం రు. 300 కోట్లకు పైగా బడ్జెట్ అవసరం అవుతుంది. ఈ సినిమాను దాదాపు 9 భాషల్లో విడుదల చేయబోతున్నారు.ఇతర సినిమా ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌లు కూడా కావాలి. అందుకే బలమైన ఫండింగ్ అవసరం. అందుకే అడ్వాన్స్‌లు, నాన్ థియేట్రిక‌ల్ ద్వారా ముందుగానే కొంత లాక్కునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌.

Share post:

Latest