సర్వే కిటుకు..అందుకే వైసీపీ హవా!

ఈ మధ్య వస్తున్న నేషనల్ సర్వేల్లో వైసీపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపేకే అధికారం దక్కుతుందని నేషనల్ మీడియా సర్వేల్లో తేలింది. అంటే నెక్స్ట్ కూడా తమదే అధికారమని వైసీపీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నాయి. ఇంకా తమకు తిరుగులేదని అనుకుంటున్నారు. అవును సర్వేలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది…ఇటీవల వచ్చిన ఇండియా టీవీ సర్వేలో వైసీపీకి 19, టీడీపీకి 6 ఎంపీ సీట్లు వస్తాయని తేలింది. అలాగే ఇండియా టుడే సర్వేలో వైసీపీకి 18, టీడీపీకి 7 సీట్లు దక్కుతాయని తేలింది. తాజాగా వచ్చిన టైమ్స్ నౌ సర్వేలో వైసీపీ 17-23 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది.

అలాగే అసెంబ్లీ సీట్లు వచ్చి 130 వరకు గెలుచుకుంటుందని సర్వేల్లో తెలుస్తుంది. అంటే నెక్స్ట్ జగన్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సర్వేలని వైసీపీ బాగా ప్రచారం చేసుకుంటుంది…ఇంకా తమకు తిరుగులేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. అయితే కాసేపు సర్వేలు నిజమే అనుకుందాం..కానీ సర్వేల్లో వస్తున్న ఫలితాల ప్రకారం చూసుకుంటే..ఆ స్థాయిలో వైసీపీ ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే డౌటే అని చెప్పొచ్చు.

ఎందుకంటే గత ఎన్నికల్లోనే 25 కి 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని, విభజన హామీలు అమలు అయ్యేలా చేస్తానని జగన్ చెప్పారు. జనం 22 మంది ఎంపీలని ఇచ్చిన సరే ఉపయోగం లేకుండా పోయింది. పోనీ ఇప్పుడున్న ఎంపీల్లో ఎంతమంది అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు…ఎవరు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు? అంటే ఏమో చెప్పడానికి అసలు ముందు ఎంపీల గురించి జనాలకు సరిగ్గా తెలియని పరిస్తితి. మరి అలాంటప్పుడు మళ్ళీ ప్రజలు…వైసీపీకి అన్నీ ఎంపీ సీట్లు ఇస్తారనేది డౌటే అని విశ్లేషకులు అంటున్నారు. పైగా ఎన్నికల నాటికి పరిస్తితి ఎలా మారుతుందో చెప్పలేం అంటున్నారు.

అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాల్లో ఒక భాగం మీడియా మేనేజ్మెంట్ అని, నేషనల్ మీడియా ద్వారా సర్వేల్లో వైసీపీ హవా ఉండేలా మేనేజ్ చేశారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి…ఇంకా కొన్ని నేషనల్ సర్వేలు రావొచ్చు అని, వాటిల్లో కూడా వైసీపీ హవా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి సర్వేలని పూర్తిగా నమ్మడానికి వీలు లేదని చెబుతున్నారు.